పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో ట్రాప్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించి తొలి భారతీయ మహిళగా నిలిచిన నీరూ ధండాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
నీరూ ధండా ప్రదర్శించిన అసాధారణమైన గురిని, నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆమె సాధించిన ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ చరిత్రాత్మక విజయం మరెందరో యువ క్రీడాకారులను షూటింగ్ క్రీడను ఎంచుకుని, అత్యున్నత పురస్కారాలు సాధించేలా కృషి చేయడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
“నీరూ ధండా భారత్ గర్వించదగిన చరిత్రాత్మక క్షణాన్ని అందించారు.! ఆసియా క్రీడల్లో ట్రాప్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన ఆమెకు అభినందనలు. ఆమె గురి, నైపుణ్యం దేశం గర్వించేలా చేశాయి. ఈ విజయం మరెందరో యువ క్రీడాకారులను షూటింగ్ క్రీడను ఎంచుకుని, అత్యున్నత పురస్కారాలు సాధించే దిశగా కృషి చేయడానికి ప్రోత్సహిస్తుంది” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.
***