Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని అందించిన మిక్స్డ్ 4×400 మీ. రిలే జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల్లో మిక్స్డ్ 4×400 మీటర్ల రిలే పోటీలో అసాధారణ ప్రదర్శనను కనబరిచి రజత పతకాన్ని గెలిచిన మనూ టీఎస్, పూవమ్మ ఎమ్ఆర్, విశాల్ టీకే, విద్యా రామరాజ్‌‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

వారి వేగం, సమన్వయం, దృఢసంకల్పం పోటీని ఉత్తేజపరిచిందనీ, ఇది భారతీయ వ్యాయామ క్రీడల్లో ఆనందదాయక క్షణమనీ ప్రధానమంత్రి అన్నారు. రాబోయే కాలంలో కూడా వారు నిరంతరం విజయాలు సాధిస్తుండాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:

‘‘మిక్స్డ్ 4×400 మీటర్ల రిలేలో మన జట్టు అద్భుత ప్రదర్శన.

ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలిచినందుకు మనూ టీఎస్, పూవమ్మ ఎమ్ఆర్, విశాల్ టీకే, విద్యా రామరాజ్‌‌‌లకు అభినందనలు. వారి వేగం, సమన్వయం, పట్టుదల ఈ పోటీని ఉత్తేజకరంగా మార్చాయి. ఇది భారతీయ అథ్లెటిక్స్‌ చరిత్రలో ఆనందదాయక క్షణం. వారు ఇదే మాదిరిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.

 

***