ఆసియా పారాక్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో రజతం సొంతం చేసుకున్న రాకేశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.
తన ప్రతిభతో దేశానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చారని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజికమాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘తన అద్భుతమైన ప్రతిభతో దేశానికి రజత పతకాన్ని తీసుకొచ్చారు రాకేశ్!
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి అపారమైన గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఆయనకు అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: పీఎం మోదీ’’
***
An outstanding effort by Rakesh brings India a Silver Medal! With a wonderful throw in the Men's Discus Throw F43/F44/F62/F64 event, he has brought immense happiness to the nation. Congrats to him and best wishes for his future endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026