Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన హిమాన్షు నందల్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆసియా పారా క్రీడలు – 2026లో పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఎస్‌11 విభాగంలో కాంస్య పతకం సాధించిన హిమాన్షు నందల్‌ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. 

 

ఈత పోటీలో హిమాన్షు అద్భుతమైన ప్రతిభను ప్రశంసించిన ప్రధాని, అతడి ప్రదర్శన కృషి, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో హిమాన్షు మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

“హిమాన్షు నందల్‌ ఈతలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు! ఆసియా పారా క్రీడలు – 2026లో పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఎస్‌11 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అతడి ప్రదర్శన కృషి, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనం. హిమాన్షుకు అభినందనలు. భవిష్యత్తులో అతడు మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

****