Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన అశోక్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆసియా పారా క్రీడల్లో పురుషుల 65 కిలోల విభాగం పారా పవర్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన అశోక్‌ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 

 

పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి గర్విస్తున్నానని, అతడి అద్భుత ప్రదర్శన ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అశోక్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

“అశోక్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు! ఆసియా పారా క్రీడలు – 2026లో పురుషుల 65 కిలోల విభాగం పారా పవర్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించినందుకు అభినందనలు. అశోక్‌ పట్టుదల, ఆత్మవిశ్వాసం గర్వకారణం. భవిష్యత్తులో కూడా అశోక్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

***