Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో రజత పతకాలు సాధించిన నితేశ్‌ కుమార్‌, తులసిమతి మురుగేశన్‌లకు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా పారా క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్ఎల్3-ఎస్యూ5 విభాగంలో రజత పతకం సాధించిన నితేశ్‌ కుమార్‌, తులసిమతి మురుగేశన్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందనలు తెలిపారు.

గత పోటీల్లో కాంస్య పతకం సాధించిన వీరు, ఈసారి రజత పతకానికి ఎదగడం అభినందనీయమైన విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీరు భవిష్యత్తులోనూ మరింత రాణిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

“ఆసియా పారా క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్ఎల్3-ఎస్యూ5 విభాగంలో రజత పతకం సాధించిన నితేశ్‌ కుమార్‌, తులసిమతి మురుగేశన్‌లకు అభినందనలు! గత పోటీల్లో కాంస్య పతకం సాధించిన వీరు, ఈసారి రజత పతకాన్ని కైవసం చేసుకోవడం అభినందనీయమైన విజయం. వీరు ఇలాగే రాణిస్తూ దేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలి. వారికి శుభాకాంక్షలు”  అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసింది.