ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఎస్13 విభాగంలో అద్భుత ప్రతిభతో రజత పతకం గెలుచుకున్న రవి కార్తీక్ బుడిగినాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
రవి కార్తీక్ నైపుణ్యం, కఠోర శ్రమ దేశానికి గర్వకారణమని పేర్కొంటూ- ఆయన భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రవి కార్తీక్ బుడిగిన అద్భుత ప్రతిభ చూపాడు! ఆసియా పారా గేమ్స్-2026లో పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఎస్13 విభాగంలో రజత పతక విజేతగా నిలచిన అతనికి అభినందనలు. పతక సాధనలో రవి నైపుణ్యం, కఠోర శ్రమ దేశానికెంతో ఆనందదాయకం. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***
Excellent swimming by Ravi Kartik Budigina! Congrats to him on winning the Silver Medal in the Men’s 100m Backstroke S13 event at the Asian Para Games 2026. His skill and hard work have brought pride to the nation. Wishing him continued success in his upcoming competitions: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026