ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్బీ11 పోటీలో చాలా చక్కని టైమింగుతో కాంస్య పతకాన్ని సాధించి, భారత్ పతకాల పట్టికలో ఇంకొక పతకాన్ని జోడించిన శ్రీ హిమాంశు నందల్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఆటలో శ్రేష్ఠత్వాన్ని కనబరచాలనే శ్రీ నందల్ నిబద్ధత కొనియాడదగ్గదని శ్రీ మోదీ అన్నారు. భావి ప్రయత్నాల్లోనూ ఆయన రాణించాలంటూ, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘భారతదేశ పతకాల పట్టికలో మరో పతకాన్ని శ్రీ హిమాంశు నందల్ జోడించారు. ఆయన చాలా చక్కని టైమింగుతో, ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్బీ11 పోటీలో కాంస్య పతకాన్ని భారత్‌కు అందించారు. ఆటలో శ్రేష్ఠత్వాన్ని కనబరచాలనే శ్రీ నందల్ నిబద్ధత ప్రశంసనీయం. భావి ప్రయత్నాల్లోనూ ఆయన రాణించాలని నేను కోరుకుంటూ, ఆయనను అభినందిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***
Himanshu Nandal adds another medal to India’s tally! With a very good timing, he brings home the Bronze in the Men’s 100m Breaststroke SB11 event at the Asian Para Games 2026. His commitment to sporting excellence is appreciable. Congratulations and best wishes for his upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026