Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత నిరంజన్‌ ముకుందన్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ‘ఎస్‌ఎం7’ విభాగంలో కాంస్య పతకం సాధించిన నిరంజన్ ముకుందన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

 

ఈ క్రీడలలో అద్భుత నైపుణ్యం, దీక్ష ప్రదర్శించిన నిరంజన్‌ను ప్రశంసిస్తూ- ఈ కఠిన ఈవెంట్‌లో అతని విజయం వేనోళ్ల కొనియాడదగినదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇదేవిధంగా అతడు భవిష్యత్తులోనూ మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“నిరంజన్‌ నైపుణ్యం, దీక్ష అత్యద్భుతం… పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఎంస్‌ఎం7 ఈవెంట్‌లో కాంస్యంతోపాటు దేశ పౌరుల ప్రేమాభిమానాలను కూడా గెలుచుకున్న నిరంజన్ ముకుందన్‌కు అభినందనలు. ఇంత కఠిన ఈవెంట్‌లో ఈ విజయం అపార ప్రశంసార్హం. భవిష్యత్తులోనూ అతడు నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.