Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత తేజల్‌బెన్ దమోర్‌కు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా పారా గేమ్స్‌ మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో కాంస్య పతక విజేత తేజల్‌బెన్ దమోర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

 

ఆసియా పారా గేమ్స్‌లో ఆమె ప్రస్థానం చిరస్మరణీయ అరంగేట్రంతో అద్భుతంగా ప్రారంభమైందని ఆయన అభివర్ణించారు. ఓ ప్రధాన అంతర్జాతీయ వేదికపై ఇంతటి ఆశావహ ప్రతిభా ప్రదర్శన ఆమె సామర్థాన్ని ప్రస్ఫుటం చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“తేజల్‌బెన్ దమోర్‌కు ఇది చిరస్మరణీయ అరంగేట్రం! మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో కాంస్య పతకం సాధించడం ద్వారా ఆమె తన ఆసియా పారా గేమ్స్ ప్రస్థానానికి అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఒక ప్రధాన అంతర్జాతీయ వేదికపై ఇంతటి ఆశావహ ప్రదర్శన ఆమె ప్రతిభ, సామర్థ్యాలను విశదం చేసింది. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.