Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత శ్రీ హిమాంశు నందల్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల  100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ11 పోటీలో చాలా చక్కని టైమింగుతో కాంస్య పతకాన్ని సాధించి, భారత్‌ పతకాల పట్టికలో ఇంకొక పతకాన్ని జోడించిన శ్రీ హిమాంశు నందల్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఆటలో శ్రేష్ఠత్వాన్ని కనబరచాలనే శ్రీ నందల్ నిబద్ధత కొనియాడదగ్గదని శ్రీ మోదీ అన్నారు. భావి ప్రయత్నాల్లోనూ ఆయన రాణించాలంటూ, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘భారతదేశ పతకాల పట్టికలో మరో పతకాన్ని శ్రీ హిమాంశు నందల్‌ జోడించారు. ఆయన చాలా చక్కని టైమింగుతో, ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల  100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ11 పోటీలో కాంస్య పతకాన్ని భారత్‌కు అందించారు. ఆటలో శ్రేష్ఠత్వాన్ని కనబరచాలనే శ్రీ నందల్ నిబద్ధత ప్రశంసనీయం. భావి ప్రయత్నాల్లోనూ  ఆయన రాణించాలని నేను కోరుకుంటూ, ఆయనను అభినందిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

***