Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాల్కం ట‌ర్న్‌బుల్ కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌


ఆస్ట్రేలియా ప్ర‌ధానిగా నియ‌మితులైన మాల్కం ట‌ర్న్‌బుల్‌తో భార‌త ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు మాట్లాడి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ` ` ప్ర‌ధాని మాల్కం ట‌ర్న్‌బుల్ నేను కొద్ది సేప‌టి కింద‌ట మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా ప్ర‌ధానిగా నియ‌మితులైన ఆయ‌న‌ను నేను అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపాను. నాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌చేసిన ఆయ‌న‌కు నా ధ‌న్య‌వాదాలు తెలియ‌చెప్పాను.టానీ అబోట్‌తో మాట్లాడిన‌ సంద‌ర్భంగా, భార‌త్‌-ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య స్నేహ‌సంబంధాలు మెరుగుప‌డేందుకు ఆయ‌న‌ చేసిన కృషిని ప్ర‌శంసించాను ` అని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు.

***