Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో రియల్-టైమ్ సంజ్ఞా భాష అనువాదంతో ఏఐ- ఆధారిత వాడుకను ప్రస్తావించిన ప్రధానమంత్రి


ఈ రోజు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత్రిమ మేధ యుగంలో యాక్సెసిబిలిటీసమ్మిళితత్వం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను స్పష్టం చేశారు.

ఏఐ సాంకేతికత ద్వారా సంజ్ఞా భాషలో రియల్టైమ్ అనువాదం ప్రారంభమైందిదీని ద్వారా దివ్యాంగులు ఈ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనగలరువిభజలను అనుసంధానించేపౌరులందరినీ శక్తిమంతం చేసే ఆవిష్కరణలకు భారత్ మద్దతునిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా నా ప్రసంగంలో ఏఐని ఉపయోగించి సంకేత భాషలో రియల్టైమ్ అనువాదం గురించి నేను ప్రస్తావించానుఇది ఏఐ రంగంలో యాక్సెసిబిలిటీసమ్మిళితత్వాల పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందిసాంకేతికతనుప్రజల మధ్య అభిప్రాయాల బదిలీని దివ్యాంగులకూ అందుబాటులో ఉంచేందుకు సదా మేం కృషి చేస్తాం.”

 

***