Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘ఇండియా ఐడియాజ్ సమిట్ 2020’’ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


 

నమస్తే.

వ్యాపార రంగ నాయకులు,

విశిష్ట అతిథులారా,

‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో ప్రసంగించడానికి నన్ను ఆహ్వానించినందుకు గాను యుఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) కి ఇవే నా ధన్యవాదములు.  ఈ సంవత్సరం లో నలభై ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న యుఎస్ఐబిసి కి ఇవే నా అభినందనలు.   గత దశాబ్దాల లో, భారతీయ వ్యాపారాన్ని మరియు అమెరికా వ్యాపారాన్ని యుఎస్ఐబిసి మరింత చేరువ కు తీసుకు వచ్చింది.  యుఎస్ఐబిసి ప్రస్తుత సంవత్సరపు ఐడియాజ్ సమిట్ కోసం తీసుకొన్నటువంటి ‘‘ఉత్తమ భవిష్యత్తు ను నిర్మించడం’’ అనే ఇతివృత్తం కూడా చాలా సందర్భోచితం గా ఉంది.

మిత్రులారా,

ప్రపంచానికి మంచి భవిష్యత్తు అవసరమని మనమంతా అంగీకరిస్తున్నాము.  అందువల్ల, మనమందరం సమష్టి గా భవిష్యత్తు కు ఒక రూపాన్ని ఇవ్వాలి.  భవిష్యత్తు పట్ల మన విధానం ప్రధానం గా మరింత మానవ సంబంధాల తో కేంద్రీకృతమై ఉండాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.  మన వృద్ధి కార్యసూచీ ప్రధానం గా పేదల కు, బలహీనుల కు సహాయపడేదిగా ఉండాలి.  ‘‘ఈజ్ ఆఫ్ బిజినెస్’’ ఎంత మహత్వపూర్ణమైందో ‘‘ఈజ్ ఆఫ్ లివింగ్’’ కూడా అంతే మహత్వపూర్ణమైనటువంటిది.

మిత్రులారా,

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ గా సామర్థ్యం పైన, అవకాశాల ను అత్యుత్తమంగా ఉపయోగించుకోవడం పైన దృష్టి పెట్టినట్లు ఇటీవలి అనుభవం మనకు నేర్పించింది.  సామర్ధ్యం అనేది ఒక మంచి విషయం.  అయితే, మార్గమధ్యం లో, మనం అంతే ముఖ్యమైన ఒక విషయం పైన శ్రద్ధ తీసుకోవడాన్ని మరచిపోయాము.  అది బాహ్య ఆక్రమణల కు ఎదురీది నిలవడం.  ప్రతిఘాతుక స్థితి ఎంత ముఖ్యమో ప్రపంచవ్యాప్త వ్యాధి ఒకటి మనల కు గుర్తు చేయవలసి వచ్చింది.

మిత్రులారా,

పటిష్టమైన దేశీయ ఆర్థిక శక్తి యుక్తుల ను సంతరించుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక ప్రతిఘాతుకత ను సాధించవచ్చును.  దీనికి అర్థం తయారీ రంగం లో మెరుగైన దేశీయ సామర్థ్యాన్ని సాధించడం, ఆర్థిక వ్యవస్థ యొక్క స్వస్థత ను పునరుద్ధరించడం, ఇంకా అంతర్జాతీయ వ్యాపారాన్ని వైవిధ్యభరితం గా మార్చడమూను అన్నమాట.

మిత్రులారా,

భారతదేశం ‘ఆత్మ నిర్భర్ భారత్’ కు పిలుపు నివ్వడం ద్వారా  ఒక సంపన్నమైనటువంటి మరియు ప్రతిఘాతుకత్వం కలిగినటువంటి ప్రపంచానికి తన వంతు తోడ్పాటు ను అందిస్తున్నది.  మరి  దీని కోసం, మీ యొక్క భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాము.

మిత్రులారా,

నేడు, భారతదేశం పట్ల ప్రపంచం లో ఆశాభావం నెలకొన్నది.  ఇలాగ ఎందుకు అంటే, భారతదేశం బాహాటత్వం,  బహిరంగ పరచడం, అవకాశాలు మరియు ఐచ్ఛికాల యొక్క పరిపూర్ణమైనటువంటి మేళనాన్ని ఇవ్వజూపుతున్నది.  ఈ విషయాన్ని నన్ను మరింత వివరం గా చెప్పనివ్వండి.  ప్రజల లో మరియు పాలన లో అరమరికలు ఉండకపోవడాన్ని భారతదేశం ప్రోత్సహిస్తుంది.  దాపరికం లేనటువంటి మస్తిష్కాలు తెరచి ఉంచిన విపణుల కు చోటు నిస్తాయి.  అడ్డు లేని బజారు లు మరింత సమృద్ధి కి దారి తీస్తాయి.  ఈ సూత్రాల ను భారతదేశం మరియు యుఎస్ఎ లు రెండూ అంగీకరిస్తాయి.

మిత్రులారా,

గడచిన ఆరు సంవత్సరాల కాలంలో, మా ఆర్థిక వ్యవస్థ ను మరింత బాహాటమైందిగా, సంస్కరణ ప్రధానమైంది గా తీర్చిదిద్దడానికి మేము అనేక ప్రయాసల కు పూనుకొన్నాము.  సంస్కరణ లు ‘స్పర్ధాత్మకత’ ను పెంచాయి; ‘పారదర్శకత్వాన్ని’ పెంపు చేశాయి; ‘డిజిటైజేశన్’ ను విస్తరించాయి; మరిన్ని ‘నూతన ఆవిష్కరణ’ కు, ఇంకా మరింత అధిక ‘విధాన పరమైనటువంటి స్థిరత్వాని’ కి బాట పరిచాయి.

మిత్రులారా,

భారతదేశం ఇప్పుడు అవకాశాల కు నిలయమైనటువంటి దేశం  ఉదయిస్తున్నది.  సాంకేతిక విజ్ఞాన రంగాని కి చెందిన ఒక ఉదాహరణ ను గురించి నన్ను ప్రస్తావించనివ్వండి.  ఇటీవల, భారతదేశం లో ఒక ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది.  పట్టణాల లోని ఇంటర్ నెట్ వినియోగదారుల కంటే ఎక్కువ సంఖ్య లో గ్రామీణ ప్రాంతాల లో ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్నారని ఆ నివేదిక పేర్కొన్నది.  ఆ సంఖ్య ఎంత ఉంటుందో ఒక సారి ఊహించండి!  ఇంటర్ నెట్ ను తరచు గా ఉపయోగించే వారు భారతదేశం లో ప్రస్తుతం సుమారు అర్ధ బిలియన్ మంది ఉన్నారు.  సంధానమైన ప్రజ యొక్క సంఖ్య అర్ధ బిలియన్.  ఇది మీకు చాలా పెద్దది గా అనిపిస్తున్నదా?  అయితే, మీరు మీ యొక్క ఊపిరి ని ఒక సారి బిగపట్టుకోండి.  దీనికి కారణం, త్వరలోనే ఇంటర్ నెట్ తో జోడింపబడుతున్నటువంటి ప్రజల సంఖ్య మరో అర్ధ బిలియన్ కు పైబడే ఉంటుంది.  మళ్లీ సాంకేతిక విజ్ఞాన రంగం లోని అవకాశాల లో కూడాను 5-జి, బిగ్ డేటా ఎనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్-చైన్ మరియు ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ వంటి తుది అంచు సాంకేతిక పరిజ్ఞాన సంబంధి అవకాశాలు సైతం చేరి ఉన్నాయి.

మిత్రులారా,

భారతదేశం లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు విస్తృతం గా ఉన్నాయి.  మా రైతుల కఠోర శ్రమ ను దృష్టి లో పెట్టుకొని పెట్టుబడి పెట్టవలసిందిగా మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తున్నది.  వ్యవసాయ రంగం లో భారతదేశం ఇటీవల చరిత్రాత్మకమైన సంస్కరణల ను తీసుకు వచ్చింది.  వ్యవసాయ అవసరాలు మరియు యంత్రాలు, వ్యవసాయ సరఫరా వ్యవస్థ యొక్క నిర్వహణ, తినడానికి సిద్ధం గా ఉండే ఆహార పదార్ధాలు,  మత్స్య పరిశ్రమ మరియు సేంద్రియ ఉత్పత్తులు వంటి వ్యవసాయ రంగానికి చెందిన అనేక విభాగాల లో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.  భారతదేశం యొక్క ఫూడ్ ప్రోసెసింగ్ రంగం 2025 వ సంవత్సరం కల్లా అర్ధ ట్రిలియన్ డాలర్ లకు పైగా విలువ ను సంతరించుకొంటుందని అంచనా.  ఆదాయ మార్గాల ను మరింత గా పెంపొందించుకోవడం కోసం, భారతదేశం యొక్క వ్యవసాయ రంగం లో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవడానికి శ్రేష్ఠమైనటువంటి తరుణం ఏదయ్యా అంటే అది ఇదే.

ఆరోగ్య సంరక్షణ రంగం లో పెట్టుబడి పెట్టవలసిందిగా మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తోంది.  భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం ఏటా 22 శాతం కంటే ఎక్కువ వేగం గా వృద్ధి చెందుతున్నది.  మెడికల్-టెక్నాలజీ, టెలి-మెడిసిన్ ఇంకా వ్యాధి నిర్ధారణ లలో కూడాను మా కంపెనీలు పురోగమిస్తున్నాయి.  భారత‌దేశం మరియు యుఎస్ ఇప్పటికే ఔషధ నిర్మాణం రంగం లో పటిష్టమైన భాగస్వామ్యాన్ని నిర్మించాయి.  భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో స్థాయినీ, వేగాన్నీ పెంచుకోవడానికి వీలు గా మీ పెట్టుబడి ని విస్తరించడానికి ప్రస్తుత కాలం అత్యుత్తమమైనటువంటి తరుణం గా ఉంది.

శక్తి రంగం లో పెట్టుబడి పెట్టవలసిందిగా  మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తోంది.  భారతదేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ గా పరిణామం చెందుతున్న నేపథ్యం లో, యుఎస్ కంపెనీల కు పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  స్వచ్ఛ శక్తి రంగం లోనూ అవకాశాలు అధికం గా ఉన్నాయి.  మీ పెట్టుబడి నుండి అధిక శక్తి ని ఉత్పత్తి చేసుకోవడం కోసం, భారతీయ విద్యుత్ రంగం లోకి ప్రవేశించడానికి ఇదే అన్నింటి కంటే మంచి కాలం.

మౌలిక సదుపాయాల కల్పన రంగం లో పెట్టుబడులు పెట్టాలని మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తోంది.  మా యొక్క చరిత్ర లోకెల్లా అతి పెద్ద స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ను ప్రస్తుతం మా దేశం వీక్షిస్తున్నది.  రండి, మా దేశం లో లక్షల మందికి గృహనిర్మాణం కల్పించడంలోనో, లేదా రోడ్ల ను, హైవేస్ ను, ఇంకా ఓడరేవుల ను నిర్మించడం లో భాగస్వామి కండి.

పౌర విమానయాన రంగం గొప్ప వృద్ధి కి తావు ఉన్న మరొక రంగం గా ఉన్నది.  రాబోయే 8 సంవత్సరాల లోపల విమాన ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కంటే మించిపోగలదని అంచనా వేయడమైంది.  రాబోయే దశాబ్దంలో వెయ్యికి పైగా కొత్త విమానాలను సమకూర్చుకోవాలని ప్రముఖ ప్రైవేటు భారతీయ విమానయాన కంపెనీ లు ప్రణాళికల ను వేసుకొంటున్నాయి.  భారతదేశం లో తయారీ కేంద్రాల ను ఏర్పాటు చేయాలని కోరుకొనే ఏ పెట్టుబడిదారుకైనా ఇది ఒక పెద్ద అవకాశం గా ఉన్నది.  ఇటువంటి కేంద్రం ఏదయినా మరి అది ప్రాంతీయ విపణుల కు సరఫరా చేయడానికి ఒక స్థావరం కాగలుగుతుంది.  మెయింటెనన్స్ రిపేర్ ఎండ్ ఆపరేశన్స్ (ఎమ్ ఆర్ ఒ) సదుపాయాల ను ఏర్పాటు చేయాలన్నా కూడా ఇదే విషయం వర్తిస్తుంది.   మీ యొక్క విమానయాన రంగ లక్ష్యాల కు రెక్కల ను తొడగాలనుకొంటే గనక భారతదేశ విమానయాన రంగం లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక ఆదర్శప్రాయమైనటువంటి  కాలం గా ఉంటుంది.

రక్షణ రంగం లో మరియు అంతరిక్ష రంగం లో పెట్టుబడులు పెట్టవలసిందంటూ మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తోంది.  రక్షణ రంగం లో పెట్టుబడుల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ ‌డిఐ) పరిమితి ని మేము 74 శాతాని కి పెంచుతున్నాము.  రక్షణ పరికరాలు, ఇంకా ప్లాట్ ఫార్మ్ స్ ఉత్పత్తి ని ప్రోత్సహించడం కోసం భారతదేశం రెండు రక్షణ కారిడార్ లను ఏర్పాటు చేసింది.  ప్రయివేటు పెట్టుబడిదారుల కు మరియు విదేశీ పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాల ను మేము ఇవ్వజూపుతున్నాము.  కొన్ని వారాల క్రితం, అంతరిక్ష రంగం లో విప్లవాత్మక సంస్కరణల ను మేము ఆమోదించాము.  రండి, భవిష్యత్తు లో అభివృద్ధి చెందగల ఈ యొక్క రంగాల లో పాలుపంచుకోండి.

ఆర్ధిక రంగం లోను, బీమా రంగం లోను పెట్టుబడులు పెట్టవలసిందిగా మిమ్ములను భారతదేశం ఆహ్వానిస్తోంది.  బీమా రంగం లో పెట్టుబడుల కోసం ఎఫ్ డిఐ పరిమితి ని 49 శాతానికి భారతదేశం పెంచింది.  బీమా మధ్యవర్తి సంస్థల లో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుతం 100 శాతం ఎఫ్ డిఐ ని అనుమతించడం జరుగుతోంది.  భారతదేశం లో భీమా విపణి 12 శాతాని కి పైగా వృద్ధి రేటు ను నమోదు చేస్తున్నది.  ఇంకా ఇది 2025 వ సంవత్సరం కల్లా 250 బిలియన్ డాలర్ మేరకు పెరుగుతుందన్న అంచనా ఉంది.  మా ఆరోగ్య బీమా పథకం అయినటువంటి ‘ఆయుష్మాన్ భారత్’ మరియు మా పంటల బీమా పథకం అయినటువంటి ‘‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’’ లతో పాటు జన సురక్ష లేదా సామాజిక భద్రత పథకాల విజయం తో బీమా ఉత్పత్తుల సత్వర స్వీకారానికి  మరియు అంగీకారానికి ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేసింది.   ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం మరియు జీవిత బీమా లలో బీమా రక్షణ తాలూకు కవరేజీని పెంచడానికి అవకాశాలు అనేకం గా ఉన్నాయి.  దీర్ఘకాలికమైనటువంటి మరియు హామీ తో కూడిన టువంటి ఆదాయాలను సంపాదించుకోవడానికి, భారతదేశ బీమా రంగం ప్రస్తుతం అత్యుత్తమమైన పెట్టుబడి ఐచ్ఛికాల లో ఒక ఐచ్ఛికం గా ఉన్నది.

నేను మీకు కొన్ని అవకాశాలను తెలియజేశాను.  అది కూడా ఆ సలహాల కు ఎటువంటి రుసుము ను తీసుకోకుండానే.

మిత్రులారా,

విపణులను తెరచి ఉంచినప్పుడు, అవకాశం మిక్కుటం గా ఉన్నప్పుడు, మరి ఐచ్ఛికాలు అనేకం గా ఉన్నప్పుడు, ఆశావాదం వెనుకబడి పోతుందా!  కీలకమైన వ్యాపార సంబంధి రేటింగుల‌ లో, మరీ ముఖ్యం గా ప్రపంచ బ్యాంకు యొక్క ‘‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’’ సంబంధి   రేటింగులలో, భారతదేశం ఎదుగుతున్న వేళ లో ఆశావాదాన్ని మీరు గమనించవచ్చును.

విశ్వాసానికి సర్వోత్తమమైనటువంటి ప్రదర్శన పెట్టుబడే.  ప్రతి ఏటా, మేము ఎఫ్ డిఐ లో రికార్డు స్థాయి ఎత్తుల కు చేరుకొంటున్నాము.  ప్రతి సంవత్సరమూ అంతకు ముందు సంవత్సరం చెప్పుకోదగ్గ రీతి లో ఇవి పెరుగుతున్నాయి.  2019-20 ఆర్ధిక సంవత్సరం లో భారతదేశం లోకి 74 బిలియన్ డాలర్ ల ఎఫ్ డిఐ ప్రవాహాలు వచ్చాయి.  ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 20 శాతం అధికం.  అమెరికా నుండి ‘హామీ లభించిన పెట్టుబడులు’ ఈ సంవత్సరం లో ఇప్పటికే 40 బిలియన్ డాలర్ లను మించినట్లు యుఎస్ఐబిసి లోని మిత్రులు తెలిపారు.  మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత కాలం లో కూడాను ఏం జరిగిందీ గమనించండి.  కోవిడ్ ప్రాబల్యం మధ్య.. అంటే 2020 వ సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలం లో..  20 బిలియన్ డాలర్ లకు పైగా విదేశీ పెట్టుబడుల ను భారతదేశం ఆకర్షించింది.

అయితే, భారతదేశం ఇంకా చాలా అవకాశాల ను ఇవ్వజూపుతున్నది.  ప్రపంచం యొక్క ఆర్థిక పునరుద్ధరణ కు అవసరపడే శక్తి మా దగ్గర ఉన్నది.

మిత్రులారా,

భారతదేశం యొక్క పెరుగుదల అంటే –
మీరు విశ్వసించదగిన దేశం తో వాణిజ్య అవకాశాల పెరుగుదల; పెరుగుతున్న బాహాటత్వం తో ప్రపంచ సమైక్యత పెరుగుదల;
స్థాయి ని అందించేటటేవంటి విపణి ప్రాప్తి తో మీ యొక్క పోటీతత్వం లో పెరుగుదల; మరి అదేవిధం గా,
నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటు లో ఉండడంతో మీ పెట్టుబడి కి రాబడి లో పెరుగుదల కూడాను.

మిత్రులారా,

ఈ విషయం లో, అమెరికా కంటే కొంతమంది మంచి భాగస్వాములు ఉన్నారు.  భారతదేశం, అమెరికా రెండూ భాగస్వామ్య విలువల తో కూడిన శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు.  మనం సహజ భాగస్వాములం.  గతం లో భారతదేశం-అమెరికా ఈ ఉభయ దేశాల మైత్రీబంధం ఉన్నత శిఖరాల కు చేరుకొన్నది.  మహమ్మారి అనంతర ప్రపంచం వేగం గా పూర్వ వైభవానికి చేరుకోవడం లో మన భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర ను పోషించవలసి తరుణం ఆసన్నం అయింది.  అమెరికా పెట్టుబడిదారులు తరచుగా ఒక రంగం లోకి లేదా ఒక దేశంలోకి ప్రవేశించడానికి ముందు గా సరైన కాలం కోసం వేచివుంటారు.  భారతదేశం లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి కాలం ఎప్పుడూ లేదని వారికి నేను చెప్పాలనుకొంటున్నాను.

భారతదేశం-యుఎస్ ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోవడం లో యుఎస్ఐబిసి నాయకత్వాని కి మరో సారి నేను ధన్యవాదాలు పలుకుతున్నాను.  యుఎస్‌ఐబిసి నూతన శిఖరాల ను అధిరోహించడాన్ని కొనసాగిస్తూ ఉండు గాక.

భారతదేశం- అమెరికా మైత్రి మరింత గా పెంపొందుగాక !

నమస్తే.

మీకు ఇవే ధన్యవాదములు.