Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించి, ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన జై మీనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో పురుషుల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన జై మీనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సాఫ్ట్ టెన్నిస్‌లో ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించి, జై మీనా చరిత్ర సృష్టించాడు.

ఈ విజయం భారత క్రీడా రంగంలో కీలక అధ్యాయమని ప్రధానమంత్రి అన్నారు. జై మీనా సాధించిన ఈ విజయం ఎంతో మంది యువత సాఫ్ట్ టెన్నిస్‌ని ఎంచుకుని, రాణించేలా స్ఫూర్తినిస్తుందన్నారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

భారత సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్రాత్మక విజయం!

పురుషుల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించి, ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన జై మీనాకు శుభాకాంక్షలు.

ఈ పతకం ఎంతో మంది యువత సాఫ్ట్ టెన్నిస్‌ని ఎంచుకుని, రాణించేలా స్ఫూర్తినిస్తుందన్నారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షిస్తున్నా

 

***