పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారత్‌లో ఖడ్గమృగాల సంరక్షణ కథ.. ఆ జాతి జీవుల పునరుజ్జీవనానికి అద్భుతమైన నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఖడ్గమృగాల జనాభా నిరంతరం పెరుగుతుండటంతో, ప్రపంచంలోనే ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. వీటి మనుగడకు ఆధారమైన గడ్డిభూములు, చిత్తడి నేలలను కాపాడుకోవడం ఈ జీవుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలు ఈ సంరక్షణ ప్రయాణాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తున్నదీ కేంద్ర మంత్రి రాసిన ఈ వ్యాసం వివరిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘దేశంలో ఖడ్గమృగాల సంఖ్య గణనీయంగా పెరగడం ఆ జీవుల సంరక్షణలో సాధించిన విజయం.
ఖడ్గమృగాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంరక్షణలో అత్యంత ముఖ్య దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ జాతి మనుగడకు ఆధారమైన గడ్డి భూములు, చిత్తడి నేలలను రక్షించడం వాటి భవిష్యత్తుకు ఎంతో కీలకం.
కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన ఈ ముఖ్యమైన కథనం, ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలను ప్రభుత్వ చర్యలు ఏ విధంగా బలోపేతం చేస్తున్నదీ వివరిస్తుంది’’
***
India's rhino story is one of remarkable recovery of the species.
— PMO India (@PMOIndia) September 23, 2026
With the rhino population showing sustained growth, India is now one of the world's most important custodians of the Greater One-Horned Rhinoceros. Protecting the grasslands and wetlands that sustain the species… https://t.co/Ag0guD3wcD