పిఎంఇండియా
దేశంలో తన నాయకత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇంధన రూపాంతరీకరణ ప్రస్థానాన్ని వివరించే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. విస్తృతి.. లభ్యత.. శరవేగంగా పునరుత్పాదకత వృద్ధి, అధిక ఇంధన భద్రత దీనికి ప్రాతిపదికగా ఉన్నాయి.
అలాగే, ప్రపంచ ఇంధన వాణిజ్యంలో విద్యుత్తుతో పాటు కాలుష్య రహితంగా వంట నుంచి సౌర, అణుశక్తి, జీవ ఇంధనాల దాకా భారత్ నేడు కీలక పాత్ర పోషిస్తోంది. తద్వారా మరింత వైవిధ్యభరిత, పటిష్ట ఇంధన వ్యవస్థకు స్థిరమైన రూపమివ్వడాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన భారత ఇంధన రూపాంతరీకరణ ప్రస్థానం విస్తృతి.. లభ్యత.. పునరుత్పాదక వృద్ధి శరవేగ పురోగమనం, అధిక ఇంధన భద్రతతో సాగుతోంది. ఆ మేరకు విద్యుత్తు, కాలుష్య రహిత వంట నుంచి సౌర, అణుశక్తి, జీవ ఇంధనాల దాకా దేశం క్రమంగా మరింత వైవిధ్యభరిత, పటిష్ట ఇంధన వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ విధంగా ప్రపంచ ఇంధన వాణిజ్యం-సాంకేతికతలో భారత్ పాత్ర ప్రస్ఫుటమవుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
***
India's energy story under PM @narendramodi is one of wider access, faster renewable growth and greater energy security. From electricity and clean cooking to solar, nuclear power and biofuels, India is steadily building a more diverse and stronger energy system. The journey is also giving India a bigger role in global energy trade and technology.
— PMO India (@PMOIndia) October 7, 2026