Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ కు వెళ్లనున్న ప్రధాన మంత్రి

ఇరాన్ కు వెళ్లనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరాన్ లో రెండు రోజుల ఆధికారిక పర్యటనను ఈ రోజు మొదలుపెట్టనున్నారు.

ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతా లో వరుస ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు :

“ఇరాన్ అధ్యక్షుడు రూహాని ఆహ్వానించిన మేరకు ఇవాళ, రేపు ఇరాన్ లో జరిపే పర్యటన కోసం నేను ఎదురుచూస్తున్నాను.

భారతదేశం, ఇరాన్ లు నాగరికత పరమైన సంబంధాలను కలిగివున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, ఇంకా సౌభాగ్యాల విషయంలో ప్రయోజనాలను ఈ రెండు దేశాలు ఒకదానితో మరొకటి పంచుకొంటున్నాయి.

అధ్యక్షుడు రూహాని తోను, ఇరాన్ గౌరవనీయ సుప్రీం లీడర్ తోను నేను జరిపే సమావేశాలు మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేటందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించగలవు.

వ్యాపారాన్ని, పెట్టుబడులను, అనుసంధానాన్ని, శక్తి రంగంలో భాగస్వామ్యాన్ని, సంస్కృతిని, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంచుకోవడమే మన ప్రాథమ్యంగా ఉండగలదు.

నా పర్యటనలో చాబహార్ ఒప్పందం ఓ కొలిక్కి రావాలని ఆశిస్తున్నాను.

టెహరాన్ లోని గురుద్వారా ను నేను సందర్శిస్తాను. భారత, ఇరాన్ సంబంధాల సింహావలోకనం మరియు ఆపేక్ష అనే అంశం పైన ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించనున్నాను.”