Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉజ్జయిని సింహస్థ ఏర్పాట్లను ప్రశంసించిన ప్రధాన మంత్రి


ఉజ్జయిని సింహస్థ మేళాకు తరలి వచ్చే భక్తులకు, యాత్రికులకు చేసిన విస్తృత‌ ఏర్పాట్లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ తో నిన్న న్యూ ఢిల్లీ లో సమావేశమైన అనంతరం ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో తన అభిప్రాయాలను వెల్లడించారు. సింహస్థ వద్ద సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటున్నారని, పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకొంటున్నారని తెలిసి తానెంతో సంతోషించినట్లు కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

“MP CM @ChouhanShivraj తో అద్భుతమైన భేటీ జరిగింది. ఆయన సింహస్థ లో చేసిన విస్తారమైన ఏర్పాట్లను గురించి చెప్పుకొచ్చారు.

@Simhasth లో టెక్నాలజీ ని వినియోగించుకొంటున్నారని తెలిసి సంతోషించాను. నేల మీదా, నీటి లోనూ పరిశుభ్రత పైన శ్రద్ధ తీసుకోవడం ప్రశంసనీయం.

@Simhasth ను సందర్శిస్తున్న భక్తజనులు, యాత్రికులు మన ఘనమైన సంస్కృతిని, ఘనమైన చరిత్రను కళ్లకు కట్టే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించగలుగుతారు” అని ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన సందేశంలో పేర్కొన్నారు.