Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటా లో జరిగిన ప్రమాదం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి; పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల అనుగ్రహ పూర్వక చెల్లింపును గురించి ప్రకటించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటా జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ప్రమాదంలో చనిపోయినవారి సమీప బంధువులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల, తీవ్రంగా గాయపడిన వారి సమీప బంధువులకు రూ. 50 వేల వంతున అనుగ్రహ పూర్వక చెల్లింపు ఉంటుందని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

“ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటాలో జరిగిన ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయినవారి శోకంలో నేను పాలు పంచుకుంటున్నాను. ఈ ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను”, అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.