Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా లో రహదారి ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా లో రహదారి ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

“ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా లో విషాద సంఘటన జరగడంతో నేను వ్యథ చెందాను. మృతుల కుటుంబాలకు కలిగిన వేదనలో నేను పాలు పంచుకొంటున్నాను. చిన్న పిల్లలు అసువులు బాయడం పట్ల నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

ఎటాలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.