పిఎంఇండియా
ప్రధాన మంత్రి తన స్వాగతోపన్యాసాన్ని ప్రారంభిస్తూ, ఈ రోజు- ఆగస్టు 11వ తేదీన- బ్రిటిషు పాలకులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఒక యువ విప్లవకారుడు శ్రీ కుదీరామ్ బోస్ ను ఉరి తీశారని గుర్తు చేశారు. ఈ ఘట్టం స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి త్యాగాన్ని, అలాగే మన అందరి మీద ఉన్న బాధ్యత ను కూడా మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన ప్రథమ ఉప రాష్ట్రపతి అని ప్రధాన మంత్రి చెప్పారు. శ్రీ నాయుడు కు బహుకాలిక అనుభవం తో పాటు పార్లమెంటరీ ప్రక్రియల జటిలతల పట్ల చక్కని అవగాహన కూడా ఉందని ఆయన అన్నారు.
శ్రీ వెంకయ్య నాయుడుతో తనకు ఉన్న సుదీర్ఘ సాహచర్యాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తికి తెచ్చుకొంటూ, గ్రామీణ ప్రాంతాలు, పేదలు మరియు రైతుల అవసరాల పట్ల శ్రీ నాయుడు ఎల్లప్పుడూ స్పందిస్తూ ఉంటారని, అంతేకాకుండా ఈ అంశాల పై ఆయన ఇచ్చే సూచనలు అపారమైనటువంటి విలువతో కూడుకొని ఉన్నాయన్నారు.
వినయం, పల్లె ప్రాంత నేపథ్యం కలిగిన వ్యక్తులు ఈ రోజు భారతదేశం లోని అత్యంత ఉన్నత పదవులను అలంకరించారన్న వాస్తవం భారతదేశ ప్రజాస్వామ్యంలోని పరిణతిని మరియు భారతదేశ రాజ్యాంగానికి ఉన్నటువంటి శక్తిని చాటుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
I congratulate Shri @MVenkaiahNaidu on being sworn in as India’s Vice President.
— Narendra Modi (@narendramodi) August 11, 2017
Sharing my remarks in the Rajya Sabha, welcoming Vice President Shri @MVenkaiahNaidu. https://t.co/pkNkf9GeFi
— Narendra Modi (@narendramodi) August 11, 2017