Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాల విస్తరణపై సీఈవో బెనోయిట్ బాజిన్‌తో చర్చించిన ప్రధాని

భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాల విస్తరణపై సీఈవో బెనోయిట్ బాజిన్‌తో చర్చించిన ప్రధాని


సెయింట్-గోబైన్‌ సీఈవో శ్రీ బెనోయిట్ బాజిన్‌తో చర్చలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిలో మునుపెన్నడూ లేనంత విప్లవాత్మకమైన మార్పులు భారత్‌లో జరుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాలను మరింత విస్తరించడంపైనా, అలాగే ఆవిష్కరణలూ, పునరావృత్త ఆర్థిక వ్యవస్థ, ఇతర రంగాల్లో భాగస్వామ్యంపైనా చర్చించినట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నిర్మాణ మార్గాలను అభివృద్ధి చేయడంలో భారత వైవిధ్యం, విస్తృతి ఒక ఆదర్శవంతమైన వేదికను కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“సెయింట్-గోబైన్‌ సీఈవో శ్రీ బెనోయిట్ బాజిన్‌తో చర్చించడం సంతోషంగా ఉంది. మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిలో మునుపెన్నడూ లేనంత విప్లవాత్మకమైన మార్పులు భారత్‌లో చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాలను మరింత విస్తరించడంపైనా, అలాగే ఆవిష్కరణలూ, పునరావృత్త ఆర్థిక వ్యవస్థ, ఇతర రంగాల్లో భాగస్వామ్యంపైనా చర్చించాం. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నిర్మాణ మార్గాలను అభివృద్ధి చేయడంలో భారత వైవిధ్యం, విస్తృతి ఒక ఆదర్శవంతమైన వేదికను అందిస్తాయి.

@సెయింట్‌గోబైన్”