పిఎంఇండియా
ఎంటియోక్, సమస్త ప్రాచ్యానికీ ప్రధాన గురువు, యూనివర్సల్ సిరియాక్ ఆర్థోడాక్స్ చర్చికి చెందిన సర్వోన్నత అధిపతి మోరన్ మోర్ ఇగ్నాటియస్ అఫ్రేమ్ – II తో సమావేశం కాావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.
పరమ పూజ్యునితో ప్రధానమంత్రి సమావేశమైన సందర్భంగా, వివిధ అంశాలపై ఉభయులూ చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఎంటియోక్, సమస్త ప్రాచ్యానికీ ప్రధాన గురువు, యూనివర్సల్ సిరియాక్ ఆర్థోడాక్స్ చర్చికి చెందిన సర్వోన్నత అధిపతి పరమ పూజ్య మోరన్ మోర్ ఇగ్నాటియస్ అఫ్రేమ్ – II తో సమావేశం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై మేం లోతుగా చర్చించాం’’ అని పేర్కొన్నారు.
Was honored to meet His Holiness Moran Mor Ignatius Aphrem II, The Patriarch of Antioch and All The East, and The Supreme Head of the Universal Syriac Orthodox Church.
— Narendra Modi (@narendramodi) February 27, 2026
We had a great discussion on a wide range of issues.@MorAphremII pic.twitter.com/6b4CHA4W6q