Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో నేశన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఏజింగ్ కు నేడు శంకుస్థాప‌న చేశారు. ఇది వృద్ధుల‌కు మ‌ల్టి- స్పెశాలిటి హెల్త్ కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 ప‌డ‌క‌ల‌తో కూడిన జ‌న‌ర‌ల్ వార్డు ఉంటుంది.

ఇదే కార్య‌క్ర‌మంలో భాగంగా, 555 ప‌డ‌క‌ల తో కూడిన సూప‌ర్ స్పెషాలిటీ బ్లాకును స‌ఫ్ ద‌ర్ జంగ్ ఆసుప‌త్రి లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. స‌ఫ్ ద‌ర్ జంగ్ ఆసుప‌త్రి లో 500 ప‌డ‌క‌ల తో కూడిన న్యూ ఎమర్జెన్సీ బ్లాకు ను; ఎఐఐఎమ్ఎస్ లో 300 ప‌డ‌క‌ల తో కూడిన ప‌వ‌ర్ గ్రిడ్ విశ్రామ్ స‌ద‌న్ ను మ‌రియు ఎఐఐఎమ్ఎస్, అన్సారీ న‌గ‌ర్ ఇంకా ట్రామా సెంట‌ర్ ల మ‌ధ్య క‌నెక్ష‌న్ మోటార‌బుల్ ట‌న‌ల్ ను కూడా దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అంకితం చేశారు.

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో భార‌త‌దేశం లో ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌ కు ఒక కొత్త దిశ‌ను అందించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు విధాన ప‌ర‌మైన జోక్యాల ద్వారా పేద‌లు మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు చ‌క్క‌ని ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను పొందాల‌న్న ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత అవ‌స్థాప‌న యొక్క స్థాయి ని పెంపొందిస్తున్న‌ట్లు, అలాగే మంచి ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల‌ను రెండో అంచె, ఇంకా మూడో అంచె న‌గ‌రాల‌కు విస్త‌రిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

జాతీయ ఆరోగ్య విధానాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణ తో పాటు వ్యాధుల నివార‌ణ ప్ర‌భుత్వ కార్యాచ‌ర‌ణ ప‌ట్టిక లో అగ్ర భాగాన ఉన్నట్లు ఆయ‌న తెలిపారు. ఈ ప‌నిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, త్రాగు నీరు మ‌రియు పారిశుధ్యం మంత్రిత్వ శాఖ‌, మ‌హిళ‌లు మ‌రియు బాల వికాస్ మంత్రిత్వ శాఖ ల‌తో పాటు, ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఇవ‌న్నీ పాలుపంచుకొంటున్నాయని ఆయ‌న అన్నారు.

టిబి ని 2030వ సంవ‌త్స‌రం కల్లా నిర్మూలించాల‌నేది ప్రభుత్వ లక్ష్యం కాగా, అంతకన్నా ముందుగానే 2025 సంవ‌త్స‌రం క‌ల్లా టిబి ని నిర్మూలించాలని భార‌త‌దేశం నిర్దేశించుకొంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ కార్యభారాన్ని దేశ వైద్య రంగం సాధించగలదని తాను విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.