Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్నికల్లో విజయం సాధించిన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి, ప్రాస్పెరిటీ పార్టీకి భారత ప్రధాని అభినందన


ఇథియోపియా పార్లమెంటు ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన ఆ దేశ ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీకి, ప్రాస్పెరిటీ పార్టీకి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఇథియోపియాతో చారిత్రక, బహుముఖీన, గాఢమైన సంబంధాలను ఎంతో విలువైనవిగా భారత్ భావిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గతేడాది తన ఇథియోపియా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్ – ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ బంధాలనూ మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ఇథియోపియా పార్లమెంటు ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన నా మిత్రుడు, ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీకి, ప్రాస్పెరిటీ పార్టీకి హృదయపూర్వక అభినందనలు.

ఇథియోపియాతో చారిత్రక, బహుముఖీన, గాఢమైన సంబంధాలను ఎంతో విలువైనవిగా భారత్ భావిస్తుంది. గతేడాది ఇథియోపియా పర్యటన నాకు బాగా గుర్తుంది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, మన ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ బంధాలనూ మరింత బలోపేతం చేసుకునే దిశగా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను.

***