పిఎంఇండియా
ఎలక్ట్రానిక్స్, ఇంకా సమాచార సాంకేతిక విజ్ఞానం రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందింపచేయడంలో భారతదేశానికి మరియు అంగోలా కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు ను) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకువచ్చారు.
ఈ ఎమ్ఒయు ఇ-గవర్నెన్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన సంబంధ విద్య కు అవసరమైన మానవ వనరుల వికాసం, సమాచార భద్రత, ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్ తయారీ, ఐటి ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, టెలిమెడిసిన్ తదితర రంగాలలో సన్నిహిత సహకారాన్ని పెంపొందింపచేయడానికి ఉద్దేశించినటువంటిది.