పిఎంఇండియా
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
పశ్చిమాసియాలో ప్రస్తుత సంఘర్షణను ముగింపు పలకడంతో పాటు సరిహద్దు ప్రాంతమంతటా శాంతినీ, సుస్థిరతనీ పునరుద్ధరించే విషయంలో ఓ అవగాహనకు వచ్చే దిశగా కృషి చేసినందుకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రయాన నిర్వహణలోనూ, వాణిజ్య కార్యకలాపాలలోనూ ఎలాంటి అడ్డంకులూ ఎదురవని విధంగా స్వేచ్ఛా వాతావరణం ఏర్పడేటట్లు చూడడంతో పాటు, నౌకల భద్రతను నిర్ధారించడానికి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
వాషింగ్టన్ డి.సి.లో 2025 ఫిబ్రవరిలో తాము సమావేశమైన తరువాత నుంచి ఇప్పటి వరకు ఇండియా–యు.ఎస్. కాంపాక్ట్ (కేటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ)లో భాగంగా చెప్పుకోదగిన పురోగతి చోటు చేసుకోవడాన్ని నేతలిద్దరూ సమీక్షించారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, ఇంధనం, ద్వైపాక్షిక వాణిజ్య రంగాలలో జరిగిన కీలక పరిణామాలపై వారు హర్హాన్ని వ్యక్తం చేశారు.
మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా నిర్వహిస్తున్న సంప్రదింపుల్లో కీలక పురోగతి చోటు చేసుకున్నందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఒక సమతౌల్యం కలిగిన, ఇరుపక్షాలకు ప్రయోజనాలను అందించే, వాణిజ్యపరంగా అర్థవంతమైన ఒప్పందం చేసుకొనే దిశగా కలిసి పనిచేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి శ్రీ జెమిసన్ గ్రీర్ వచ్చే వారం భారత్‌కు వస్తారు.
భారత్–అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్నా పటిష్ఠపరుచుకోవడంతో పాటు రెండు దేశాలకూ, ప్రజలకూ పరస్పర ప్రయోజనాలు కలిగేలా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలన్న ఆసక్తిని ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ ట్రంప్ పునరుద్ఘాటించారు.
***
PM @narendramodi met US President @realDonaldTrump in Evian and reviewed progress in India-US cooperation across sectors such as energy, trade, defence, technology and people-to-people ties.
— PMO India (@PMOIndia) June 17, 2026
The two leaders also exchanged views on developments in West Asia. The Prime Minister… pic.twitter.com/CVZLtgcmDL
Pleased to meet President Trump in Evian. We reviewed the sustained progress in our bilateral cooperation in trade, energy, defence, technology and people-to-people ties.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
Conveyed India’s appreciation on the progress in the efforts for restoring peace and stability in West… pic.twitter.com/hEUfr5TOJx