Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధానమంత్రి సమావేశం

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధానమంత్రి సమావేశం


ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 20 ఫిబ్రవరి 2026న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ మిస్టర్ ఆంటోనియో గుటెర్రస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావటందాన్ని మానవ కేంద్రీకృతంగా మార్చాలన్న లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహించినందుకు ప్రధానమంత్రిని యూఎన్‌ఎస్‌జీ అభినందించారుకృత్రిమ మేధపై స్వతంత్ర అంతర్జాతీయ శాస్త్రీయ ప్యానెల్‌ను ఏర్పాటు చేయటంలో యూఎన్‌ఎస్‌జీ కృషినిఅభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ విషయంలో ఆయన అందిస్తున్న మద్దతును పీఎం ప్రశంసించారుఏఐ కోసం మానవ్ దార్శనికతఅభివృద్ధికి సాంకేతికత ఉత్ర్పేరకం వంటిదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల మధ్య అధికార విస్తరణపై ఇరుదేశాల నేతలు అభిప్రాయాలను పంచుకున్నారుఐక్యరాజ్యసమితిలో ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో తక్షణ సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు.

యూఎన్‌ఎస్‌జీ గుటెర్రస్‌ మిగిలిన పదవీకాలం విజయవంతంగా సాగాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.