పిఎంఇండియా
మార్గనిర్దేశక ఉపగ్రహమైన ‘ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్-1 జి’ ప్రయోగాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని సౌత్ బ్లాక్ నుంచి వీక్షించారు. ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లిన ఈ పి ఎస్ ఎల్ వి, మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగసింది.
ఉపగ్రహాన్ని ప్రయోగించడం విజయవంతం అయిన కొద్ది సేపటికే, ప్రధాన మంత్రి శ్రీహరికోటలోని ఐఎస్ ఆర్ ఒ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫ రెన్సింగ్ మాధ్యమం ద్వారా మాట్లాడి వారిని అభినందించారు.
ప్రజల జీవనాలను మార్చివేసే శక్తి కలిగిన అంతరిక్ష శాస్త్రంలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విజయాలను సాధించారు అంటూ ఆయన ఈ సందర్భంగా వారిని కొనియాడారు.
“తాజా సఫల ప్రయోగంతో, మనం స్వీయ సాంకేతిక విజ్ఞానం అండతో మన మార్గాలను నిర్ణయించుకోగల శక్తి సంపాదించుకొన్నాం. ఇది ప్రజలకు శాస్త్రజ్ఞులు అందించిన ఒక గొప్ప బహుమతి” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఒక్క భారతదేశానికి మాత్రమే ఉపయోగపడేవి కాదని, ఎస్ ఎ ఎ ఆర్ సి లోని సాటి సభ్యత్వ దేశాలకు కూడా ఇవి తోడ్పడగలుగుతాయని ఆయన అన్నారు.
ఈ మార్గదర్శక వ్యవస్థను ఎన్ ఎ వి ఐ సి – “నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్టిలేషన్” గా వ్యవహరించనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇది “మేక్ ఇన్ ఇండియా ” కు, ఇంకా “మేడ్ ఫర్ ఇండియన్స్”కు ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.
First and foremost I want to congratulate all @isro scientists and the entire team. I also congratulate the people of India: PM
— PMO India (@PMOIndia) April 28, 2016
In space science, our scientists have achieved many accomplishments. Through space science lives of people can be transformed: PM
— PMO India (@PMOIndia) April 28, 2016
India has launched 7 such navigation satellites which have been successful: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 28, 2016
With this successful launch, we will determine our own paths powered by our technology. This is a great gift to people from scientists: PM
— PMO India (@PMOIndia) April 28, 2016
Our efforts will not only help India but we can help fellow SAARC nations as well: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 28, 2016
The benefits from this new technology will benefit our people, our fishermen. The world will know it as Navic: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 28, 2016
This is example of @makeinindia, made in India and made for Indians. 125 crore Indians have got a new Navic: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 28, 2016