Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒకేసారి ఐఎన్‌ఎస్ అగ్రే, ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్ అనే మూడు నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

ఒకేసారి ఐఎన్‌ఎస్ అగ్రే, ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్ అనే మూడు నౌకలను నావికాదళంలోకి  ప్రవేశపెట్టిన కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని


పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించిన ‘ఐఎన్‌ఎస్ అగ్రేఐఎన్‌ఎస్ దూనగిరిఐఎన్‌ఎస్ సంశోధక్’ అనే మూడు నౌకలను నావికాదళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

ఏ దేశపు సముద్రయాన సామర్థ్యం ఎంత బలంగా ఉంటుందో ఆ దేశ ఆర్థికవ్యూహాత్మక ప్రభావం కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందిభారత్ దీని కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోంది.”

భారతదేశ శక్తికి అసలైన గుర్తింపు ఆత్మనిర్భరతలోనే ఉందిఏ రోజున మనం తయారీదారులుగా మారతామో ఆ రోజున మనం నిర్ణేతలుగా కూడా ఎదుగుతాం.”

భారతదేశం నేడు తన పూర్తి సముద్రయాన వ్యవస్థను బలోపేతం చేస్తోందిదీనివల్ల రవాణా ఖర్చులు తగ్గాయిపరిశ్రమలకు సరికొత్త వేగం లభించిందితీరప్రాంతాలలో సరికొత్త అవకాశాలు వస్తున్నాయి.”

“2014 నుంచి మేం విధానాల పరంగా కీలకమైన సంస్కరణలను చేపట్టాందీని ఫలితంగా రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా పెరగడంతో పాటు మన రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ వేగంతో వృద్ధి చెందాయి.”