Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లోని ‘అమ్ఫాన్’ తుఫాను ప్రభావిత ప్రాంతాల లో విమాన పరిశీలన ను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి; 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్ర‌ధాన మంత్రి


‘అమ్ఫాన్’ తుఫాను కారణం గా ఉత్పన్నమైన స్థితి ని సమీక్షించడం కోసం ఒడిశా ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. ఈ పర్యటన లో ప్ర‌ధాన మంత్రి వెంట కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ బాబుల్ సుప్రియో, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ లతో పాటు దేబాశ్రీ చౌధరీ కూడా ఉన్నారు. ప్ర‌ధాన మంత్రి తుఫాను యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం కోసం ఒడిశా గవర్నర్ శ్రీ గణేశీ లాల్ తో మరియు ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ తో కలసి బాలాసోర్ ను, ఇంకా భద్రక్ ను గగన తలం నుండి పరిశీలించారు.

గగనతల సర్వేక్షణ ను ముగించిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులందరితో మరియు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులందరితో ప్రధాన మంత్రి అధ్యక్షత న భువనేశ్వర్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఒడిశా రాష్ట్రాని కి 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. కేంద్రానికి చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ ల బృందమొకటి ఒడిశా ను సందర్శించి, తుఫాను నష్టాన్ని అంచనా వేసి తన నివేదిక ను సమర్పించనుంది.

ఈ కష్ట కాలం లో రాష్ట్ర ప్రభుత్వాల తో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తుందని, తుఫాను ప్రభావానికి లోనైన ప్రాంతాల లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కు మరియు పునర్ నిర్మాణాని కి చేతనైన అన్ని విధాలు గా సహాయాన్ని అందజేస్తుందని కూడా రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

ఒడిశా ప్రజానీకానికి ప్రధాన మంత్రి తన పరిపూర్ణ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్రం లో తుఫాను కారణం గా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రం లో సంభవించిన తుఫాను లో మరణించిన వ్యక్తుల సమీప సంబంధికుల కు 2 లక్షల రూపాయల అనుగ్రహపూర్వక ధన రాశి ని, అలాగే తీవ్రం గా గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల అనుగ్రహపూర్వక ధన రాశి ని చెల్లించడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

**