Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒమన్ సుల్తాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వంపై చర్చ


ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు. పండగ శుభాకాంక్షలను తెలపడంతో పాటు.. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు.

సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ప్రధానమంత్రి మాట్లాడారు. ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఉద్రిక్తతలను తగ్గించి శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్యమార్గాలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఒమన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లడాన్ని

ప్రధానమంత్రి ఖండించారు. భారతీయులతో సహా వేలమంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకొనేలా ఒమన్ తీసుకున్న చర్యలను ప్రశంసించారు. హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానానికి భారత్, ఒమన్ కట్టుబడి ఉన్నాయని శ్రీ మోదీ తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

 

‘‘నా సోదరుడు సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. ఒమన్ పౌరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశాను. ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్య విధానాలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని మేం అంగీకరించాం.

ఒమన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లడాన్ని భారత్ ఖండిస్తోందని చెప్పాను. అదేవిధంగా భారతీయ పౌరులతో సహా వేలాది మంది ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకొనేలా ఒమన్ చేపట్టిన చర్యలను అభినందించాను.

 

***