పిఎంఇండియా
మన దేశంలో 2014వ సంవత్సరాని కన్నా ముందు ఒక ఎల్ఇడి బల్బు 350 రూపాయలకు పైబడిన ధరలో అమ్ముడు పోయేది; అదే ఎల్ ఇడి బల్బు ఇప్పుడు 40- 45 రూపాయలకు దొరుకుతోంది. తక్కువ ధరకు ఎల్ఇడి బల్బులు దొరుకుతుండడమే కాక వాటిని ఉపయోగిస్తున్న కుటుంబాలు ఒక సంవత్సరంలో విద్యుత్తు బిల్లుల రూపేణా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగారు.
ఇవాళ ప్రతి భారతీయుడు ఒక ‘న్యూ ఇండియా’ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నాడు. మేము పేదలలో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం అభివృద్ధి సమానావకాశాన్ని పొందగలిగే మరియు పేదలలో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం కలలు కని, వాటిని పండించుకొనే దిశగా సాగుతున్నాం.
ఇవాళ నేను నా కళ్ళెదుట ఒక బుల్లి భారతదేశాన్ని చూస్తున్నాను. దేశం లోని ప్రతి ఒక్క మూల నుండి వచ్చిన భారతీయులు, వేరు వేరు రంగాలలో పని చేస్తున్న భారతీయులు ఒక గొప్ప సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నారు.
నేను 10 సంవత్సరాల క్రితం ఓమాన్ లో పర్యటించాను. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను ఆఫ్రికాకు వెళ్తూ, మార్గమధ్యంలో సలాలా గుండా ప్రయాణించాను. నేను ఓమాన్ ను సందర్శించి మీ అందరితోనూ భేటీ అవ్వాలని, మీ మధ్య కొంత సమయాన్ని వెచ్చించాలని అప్పట్లో ఆరాటపడ్డాను. ఆ అవకాశం ఈ రోజున నాకు లభించింది. ఓమాన్ కు, భారతదేశానికి మధ్య ఉన్న సంబంధాలు వందలాది, వేలాది సంవత్సరాల కిందటివి. గత మూడేళ్ళుగా మేము గల్ఫ్ దేశాలతో భారతదేశానికి ఉన్న ప్రాచీనమైన మరియు స్నేహ పూర్వకమైన సంబంధాలకు- ప్రస్తుత అవసరాలతో తులతూగేటటువంటి ఒక విధానాన్ని రూపొందించడం ద్వారా- ఒక కొత్త రూపురేఖలను అందిస్తూ వస్తున్నాం.
భారతదేశం యొక్క స్థాయి మరియు ప్రగతి తో పాటే భారతదేశంలో గల్ఫ్ దేశాల ప్రయోజనాలు ఏ స్థాయి వరకు ఎదిగాయో మీరందరూ కూడాను గమనించే ఉంటారు.
సహజంగానే, ఓమాన్ తో భారతదేశానికి ఉన్నటువంటి చారిత్రక సంబంధాలలో ఒక కొత్తదైన కదలిక వచ్చింది. శ్రేష్ఠులైన సుల్తాన్ గారు సైతం భారతదేశంతో విశిష్టమైన సంబంధాన్ని ఏర్పరచుకొన్నారు. వారి పేరిట స్థాపించబడిన ఈ క్రీడా మైదానంలో ఈ రోజున నేను నిలబడి, ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మిమ్మల్ని ఉద్దేశించి సంభాషించడం ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది.
ఇది భారతదేశమన్నా, భారతీయులన్నా శ్రేష్ఠులైన సుల్తాన్ గారికి ఎంతటి అభిమానం ఉన్నదీ చెప్పకనే చెబుతోంది. ఈ ప్రత్యేకమైన సత్కారం పట్ల ఆయనకు మేము అమిత కృతజ్ఞులమై ఉన్నాం.
మేము ‘కనీస స్థాయి ప్రభుత్వం- గరిష్ట స్థాయి పాలన’ సూత్రాన్ని అనుసరించడం ద్వారా దేశం లోని సామాన్య మానవుడి జీవనాన్ని సరళతరంగా మార్చేందుకుగాను కృషి చేస్తున్నాం.
మేము ఈ అన్ని అంశాలను ప్రభుత్వ సంస్కృతిలో మిళితం చేశాం. ప్రక్రియలను సరళతరం చేశాం; అనవసరమైన చట్టాలను రద్దు చేశాం; ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తుల సంఖ్యను 40- 50 పేజీల నుండి 4- 5 పేజీలకు తగ్గించాం; ఆ దరఖాస్తులను ఆన్ లైన్ లో భర్తీ చేసేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం; ప్రజల ఇక్కట్లను చిత్త శుద్ధితో ఆలకించి, వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యాం.
పరివర్తనకు లోనైన భారతదేశంలో ప్రస్తుతం పేద ప్రజలు బ్యాంకులలో అవమానాల పాలై తిరుగుముఖం పట్టడం జరగడం లేదు. మారిన భారతదేశంలో ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ను ఇవ్వడానికి, విద్యుత్ కనెక్షన్ ను ఇవ్వడానికి ఇంటి ముంగిటకు వస్తోంది.
పేద ప్రజలకు రోజుకు 1 రూపాయి ప్రీమియంతో భద్రత బీమా నుమరియు రోజుకు 90 పైసల ప్రీమియంతో జీవన బీమా ను కల్పించడమైంది. ఈ బీమా పథకాలలో భాగంగా పేదవారికి క్లెయిమ్ రూపంలో 2,000 కోట్ల రూపాయలను ఇవ్వడమైంది.
బడ్జెట్ లో మేము ప్రకటించినటువంటి ఒక పథకం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా దేశం లోని 10 కోట్ల పేద కుటుంబాలకు.. అంటే సుమారు 45-50 కోట్ల మంది ప్రజలకు.. ‘ఆరోగ్య బీమా’ ను మేము అందిస్తున్నాం. ఒక్కొక్క పేద పరివారానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సకు మేము హామీని ఇచ్చాం.
ప్రస్తుతం దేశంలో 21వ శతాబ్ద అవసరాలను పరిగణన లోకి తీసుకుంటూ తదుపరి తరం మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం జరుగుతోంది. ప్రత్యేకించి మేము రవాణా రంగాన్ని అందులోని వివిధ విభాగాలు ఒకదానిని మరొకటి తోడు తీసుకొని వెళ్ళే విధంగా అభివృద్ధిపరుస్తున్నాం.
హైవేలు, ఏర్ వే లు, రైల్వేలు, ఇంకా జల మార్గాలు.. వీటన్నింటినీ ఒకదానితో మరొక దానిని వాటి వాటి అవసరాల ప్రకారం ఏకీకృత పరచడమైంది.
‘భారత్ మాలా’ ప్రాజెక్టులో భాగా 53 వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించే పనులు మొదలయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైల్వే కారిడార్లను అభివృద్ధిపరచే పని సాగుతోంది. మెట్రో రైలు వ్యవస్థను దేశంలోని 11 పెద్ద నగరాలకు విస్తరించడం జరిగింది. దేశ కోస్తా తీర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మరియు తత్సంబంధిత మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి ‘సాగర్ మాల’ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం.
మత్స్యకార సముదాయం లోని సోదరుల కోసం ఒక ‘నీలి విప్లవ’ పథకాన్ని మేము ప్రారంభించాం. ఆధునిక ట్రాలర్ల కొనుగోలు కోసం వారికి సహాయాన్ని అందిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం దేశంలో 110 కి పైగా జల మార్గాలను అభివృద్ధిపరుస్తోంది.
భారతదేశంలో నిర్ణయాలు చేయడంలో ప్రస్తుతం జాప్యం జరగడం లేదు; అలాగే, ప్రస్తుతం సవాళ్ళకు ఎదురొడ్డడం జరుగుతోంది. ప్రాజెక్టులకు లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా సకాలంలో వాటిని పూర్తి చేయడం జరుగుతోంది. ఇది భారతదేశం యొక్క మారుతున్న పని సంస్కృతికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇది ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు ఉదాహరణ ఇది.
నిర్ణయాలను ఒక స్పష్టమైన అంతఃకరణతో, చక్కగా నిర్దేశించినటువంటి ఒక విధానానికి లోబడి తీసుకొంటున్నట్లయితే దేశం యొక్క నిధులను మిగల్చుకోవడం సాధ్యపడుతుంది. ఎప్పుడైతే పనులు సమర్థమైన పద్ధతిలో సాగుతుంటాయో, ఎప్పుడైతే ప్రస్తుత వనరులను అత్యుత్తమ రీతిలో వినియోగించుకొంటుంటామో అటువంటప్పుడు దేశం తాలూకు నిధులు ఆదా అవుతాయి.
దేశ అభివృద్ధిలో మరియు జాతి నిర్మాణంలో మిమ్మల్ని ఒక ముఖ్య భాగస్వామిగా నేను భావిస్తున్నాను. ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించడం కోసం మీరు పూనిన పవిత్ర ప్రతిజ్ఞల ప్రభావాన్ని భారతదేశంలో కూడా చూడవచ్చును.
***
आज अपने सामने, मैं मिनी इंडिया को देख रहा हूं। देश के अलग-अलग कोनों से आए भारतीय, अलग-अलग क्षेत्रों में काम करने वाले भारतीय, एक भव्य तस्वीर का निर्माण कर रहे हैं: PM @narendramodi https://t.co/u2qXGHvhoy
— PMO India (@PMOIndia) February 11, 2018
मैं ओमान करीब दस साल पहले आया था। गुजरात के मुख्यमंत्री के तौर पर मेरी अफ्रीका की एक विजिट थी, और इसी दौरान मैं ‘सलाला’ से होकर गुजरा था। मेरा बहुत दिन से ओमान आने का, आपके बीच आने का, आपसे मिलने का मन था। ये अवसर आज आया है: PM @narendramodi https://t.co/u2qXGHvhoy
— PMO India (@PMOIndia) February 11, 2018
भारत और ओमान के बीच संबंध सैकड़ों-हजारों वर्ष पुराने हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
पिछले 3 साल से हम किस प्रकार एक नीति बनाकर खाड़ी के देशों के साथ भारत के पुराने और दोस्ती भरे रिश्तों को आज के समय के मुताबिक एक नया जामा पहना रहे हैं। अपने यह भी गौर किया होगा कि भारत की बढ़ती हुई प्रगति और साख के साथ-साथ खाड़ी देशों की भारत में रूचि कितनी बढ़ गई है: PM
— PMO India (@PMOIndia) February 11, 2018
जाहिर सी बात है कि ओमान के साथ भारत के ऐतिहासिक संबंधों में भी एक नई momentum आई, एक नई गति आई: PM @narendramodi https://t.co/u2qXGHvhoy
— PMO India (@PMOIndia) February 11, 2018
His Majesty Sultan का भी भारत से अभिन्न नाता है। आज इतनी बड़ी संख्या में आप सब से मुखातिब होने के लिए His Majesty Sultan के नाम पर स्टेडियम में मेरी मौजूदगी एक विशेष महत्व रखता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
यह इस बात का भी प्रतीक है कि स्वयं His Majesty Sultan और ओमान भारत और भारतीयों के साथ कितनी आत्मीयता दिखाई है। इस निहायत special gesture के लिए हम उनके बहुत कृतज्ञ हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
आज हर भारतीय न्यू इंडिया के संकल्प को पूरा करने के लिए काम कर रहा है। हम एक ऐसे भारत के निर्माण की तरफ बढ़ रहे हैं जहां गरीब से गरीब व्यक्ति को भी आगे बढ़ने के समान अवसर मिलें, जहां गरीब से गरीब व्यक्ति भी सपने देख सके, उन्हें पूरा कर सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
Minimum Government - Maximum Governance के मंत्र के साथ हम देश के आम नागरिक की जिंदगी को आसान बनाने के लिए काम कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
प्रक्रियाओं को सरल बनाना, अनावश्यक कानूनों को खत्म करना, सरकारी दफ्तरों में चालीस, पचास पेज के फॉर्म को कम करके 4-5 पर लाना, उन्हें ऑनलाइन भरने की व्यवस्था बनाना, लोगों की शिकायतों को गंभीरता से सुना जाना, उन पर कार्रवाई होना, इन कार्यों को हमने सरकार के कल्चर में शामिल किया: PM
— PMO India (@PMOIndia) February 11, 2018
बदले हुए भारत में अब गरीब को बैंकों से दुत्कार कर नहीं भगाया जाता, बदले हुए भारत में अब सरकार घर पर आकर गैस कनेक्शन दे रही है, बिजली कनेक्शन दे रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
गरीबों को सिर्फ 90 पैसे प्रतिदिन और एक रुपए महीना के प्रीमियम पर जीवन और सुरक्षा बीमा दिया जा रहा है। इन बीमा योजनाओं के तहत गरीबों को 2 हजार करोड़ रुपए की क्लेम राशि भी दी जा चुकी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
बजट में हमने एक ऐसी योजना का ऐलान किया है जो पूरी दुनिया का ध्यान खींच रही है। आय़ुष्मान भारत योजना के माध्यम से हमने देश के 10 करोड़ गरीब परिवारों, यानि करीब 45 से 50 करोड़ लोगों को हेल्थ एश्योरेंस दिया है। एक परिवार को एक साल में 5 लाख रुपए तक के मुफ्त इलाज का भरोसा दिया है: PM
— PMO India (@PMOIndia) February 11, 2018
देश में अब 21वीं सदी की जरूरत को ध्यान में रखते हुए Next Generation इंफ्रास्ट्रक्चर का निर्माण किया जा रहा है। विशेषकर ट्रांसपोर्ट सेक्टर को हम ऐसे तैयार कर रहे हैं कि वो एक दूसरे को Support करने वाले बनें: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
Highway, Airway, Railway, Waterway, सभी को एक दूसरे की जरूरत के हिसाब से integrate किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
भारतमाला प्रोजेक्ट के तहत 53 हजार किलोमीटर नेशनल हाईवेज बनाने का काम शुरू किया है। देश के अलग-अलग क्षेत्रो में रेलवे कॉरिडोर्स पर काम चल रहा है। 11 बड़े शहरों में मेट्रो का विस्तार भी किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
देश की Coastal Economy और उससे जुड़े इंफ्रास्ट्रक्चर को डवलप करने के लिए हम सागरमाला नाम से भी एक कार्यक्रम चला रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
मछुवारे भाईयों के लिए हमने Blue Revolution स्कीम शुरू की है और उन्हें आधुनिक ट्रॉलर्स खरीदने के लिए आर्थिक मदद दे रहे हैं। सरकार देश में 110 से ज्यादा WaterWays भी विकसित कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
अब भारत में फैसलों को टाला नहीं जाता, चुनौतियों से टकराया जाता है। लक्ष्य तय करके योजनाओं को समय पर पूरा किया जाता है। ये भारत में बदलते हुए Work Culture का उदाहरण है। न्यू इंडिया का उदाहरण है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
जब साफ नीयत और स्पष्ट नीति के साथ निर्णय लिए जाते हैं, तो देश का पैसा बचता है। जब Efficient तरीके से काम किया जाता है, जब मौजूदा संसाधनों का अच्छे से अच्छा उपयोग किया जाता है, तब देश का पैसा बचता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
वर्ष 2014 से पहले जो LED बल्ब हमारे यहां साढ़े तीन सौ रुपए से ज्यादा का मिला करता था, वो अब 40-45 रुपए में मिलने लगा है। सस्ते LED के अलावा, जो लोग अपने घरों में इनका इस्तेमाल कर रहे हैं, उन्हें हर साल 15 हजार करोड़ रुपए की अनुमानित बचत बिजली बिल में हो रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018
मैं आपको देश के विकास का, राष्ट्र निर्माण का महत्वपूर्ण हिस्सेदार मानता हूं, पार्टनर मानता हूं। न्यू इंडिया के सपने को पूरा करने में आपके संकल्पों का प्रभाव भारत में भी दिखाई देगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 11, 2018