పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రపంచ ఔషధశాల స్థాయి నుంచి ఆవిష్కరణల కేంద్రంగా భారత ఔషధ రంగం పరిణామం చెందుతోందని ఈ వ్యాసం తెలుపుతోంది. ఈ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీకి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విస్తృతమైన పరిశోధనలు, అభివృద్ధి, బయోలాజిక్స్, బయోసిమిలార్స్, అత్యాధునిక చికిత్సా విధానాలపై దృష్టి సారించినట్లు ఈ కథనం పేర్కొంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ప్రపంచపు ఔషధశాల స్థాయి నుంచి ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతూ.. భారత ఫార్మా రంగం విలువైన ప్రస్థానాన్ని సాగిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి, బయోలాజిక్స్, బయోసిమిలర్స్, అత్యాధునిక చికిత్సా విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఈ రంగంలో ప్రపంచవ్యాప్త పోటీలో భారత్ ఎలా నాయకత్వం వహించబోతుందో వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన ఈ అద్భుత విశ్లేషణను ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి’’
From the “pharmacy of the world” to a hub of innovation, India’s pharma sector is moving up the value chain. Under the present government, the focus has been on extensive R&D, biologics, biosimilars and cutting-edge therapies.
— PMO India (@PMOIndia) April 14, 2026
A must-read retrospection by Union Minister Shri… pic.twitter.com/zITsjGI9oV