పిఎంఇండియా
కర్మాగారాల (సవరణ) బిల్లు, 2016 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం ద్వారా కర్మాగారాల చట్టం, 1948 లోని సెక్షన్ 64లోను, సెక్షన్ 65 లోను సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు, తత్పర్యవసానంగా సెక్షన్ 115 లో సవరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఆమోదం లభించిన సవరణలు తయారీ రంగానికి ఊతం అందించగలుగుతాయి. అంతే కాక, ఉపాధి అవకాశాలను పెంపొందించే ధ్యేయంతో వ్యాపారాన్ని సులభతరంగా మార్చడంలోనూ తోడ్పడగలవు.
ఈ సవరణలు ఓవర్ టైమ్ గంటలను ఇప్పుడున్న ఒక త్రైమాసికానికి 50 గంటల వ్యవధి ని 100 గంటలకు పెంచడానికి (సెక్షన్ 64) , ఇంకా ప్రస్తుతం అమలులో ఉన్న త్రైమాసికానికి 75 గంటల వ్యవధి ని 125 గంటలకు పెంచడానికి (సెక్షన్ 65) సంబంధించినవి.