పిఎంఇండియా
ధర్మబద్ధ సమాజాన్ని నిర్మించడంలో జ్ఞానం, కష్టపడే స్వభావం, నైతిక నడవడిక ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వెలుగుతో నిండిన, జ్ఞానపూర్వక మార్గాన్ని అనుసరించాల్సిందిగానూ, ప్రయత్నాల్లో జాగరూకత కలిగి, ప్రయత్నాల్లో దృఢనిశ్చయులై ఉంటూ నైతిక, ధర్మబద్ధ సమాజాన్ని ఆవిష్కరించేందుకు తోడ్పాటును అందించాల్సిందిగానూ మనకు ఈ శ్లోకం సూచిస్తోంది.
‘‘తన్తుం తన్వన్నజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్,
అనుల్బణం వయత్ జోగువామపో మనుర్భవ జనయా దైవ్యం జనమ్’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
తన్తుం తన్వన్నజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్,
అనుల్బణం వయత్ జోగువామపో మనుర్భవ జనయా దైవ్యం జనమ్’’ అని పేర్కొన్నారు.
***
तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
— Narendra Modi (@narendramodi) August 27, 2026
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥ pic.twitter.com/hB4MEzeWC9