పిఎంఇండియా
శ్రేష్ఠుడైన అధ్యక్షులు శ్రీ మహమ్మద్ అశ్ రఫ్ గనీ, విదేశాంగ శాఖ మంత్రి శ్రేష్ఠుడైన శ్రీ రబ్బానీ మరియు
నా ప్రియ అఫ్ఘాన్ స్నేహితులు, సోదర సోదరీమణులారా.
మీ అందరినీ కలవడం నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అఫ్గానిస్తాన్ భారతదేశానికి పక్కనే ఉన్న పొరుగు దేశం; మా
మనసులలోను మస్తిష్కాలలోను భారతీయులు, అఫ్ఘాన్ లు ఎల్లప్పుడూ అత్యంత ఆప్త మిత్రులే.
ఈ రోజుమనం మరొక్కమారు మన మైత్రి యొక్క మరొక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి కలుసుకుంటున్నాం. మన కలయికతో కొనసాగుతున్న ఫలప్రద ప్రయాణంలో మరొక అడుగు ముందుకు పడింది.
శ్రేష్ఠుడైన గనీ గారు,
ఉమ్మడి భాగస్వామ్యంతో చేసిన పనులు విజయవంతంగా పూర్తయినప్పుడు స్నేహితులందరం కలసి జరుపుకొనే వేడుక ఇచ్చే ఆనందం కన్నా మించినవి ఏవీ లేవనే చెప్పాలి. మీరు, నేను గత కొన్ని నెలలలోను ముఖ్యమైన సందర్భాలకు ఇలా వేడుక జరుపుకొనే అదృష్టానికి నోచుకొన్నాము.
గత సంవత్సరం డిసెంబరులో మీరు, అఫ్గాన్ ప్రజ అఫ్గాన్ పార్లమెంట్ ను ప్రారంభించడానికి నా సరసన నిలిచారు.
ఆ ప్రారంభ కార్యక్రమం ఆధునిక అఫ్గానిస్తాన్ పునాదులను పటిష్టపరచడం కోసం మనలో ఉన్న నిబద్ధతను చాటిన ఒక సంకేతం వంటిది. ఈ సంవత్సరం మే నెలలో మనం సంతకాలు పెట్టిన భారతదేశం- అఫ్ఘానిస్తాన్- ఇరాన్ ట్రాన్సిట్ కారిడర్ ఒప్పందం మన స్నేహంలో మరొక మైలు రాయి.
అది అఫ్గానిస్తాన్ ఆర్థిక పురోగతి కోసం, సమృద్ధి కోసం కొత్త కొత్త మార్గాలను నిర్మించాలన్న మన స్పష్టమైన ఉమ్మడి కృతనిశ్చయాన్ని ప్రదర్శించింది. అంతేకాకుండా, ఒక నెల గడచిన అనంతరం, ఈ సంవత్సరం జూన్ నెలలో అఫ్గానిస్తాన్- ఇండియా ఫ్రెండ్ షిప్ డామ్ ప్రారంభోత్సవం కోసం మనము చేతులు కలిపాము.
సల్మా డామ్ కేవలం అఫ్గానిస్తాన్ లోని హెరాత్ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించడమే కాక, మొత్తంమీద అఫ్గానిస్తాన్ వృద్ధికి, ఎదుగుదలకు సైతం మూల స్తంభంగా మారగలుగుతుంది.
శ్రేష్ఠుడైన గనీ గారు,
ఈనాడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టోర్ ప్యాలెస్ ప్రారంభోత్సవం జరుపడం పూర్తి భిన్నమైనది, అయినప్పటికీ ఇది ప్రాథమిక పద్ధతి కన్నా ఎన్నో విధాలు మిన్నగా
మన కలయికను మరో దిశగా తీసుకెళ్లింది. నేను ఈ మాటలను ఎందుకు అంటున్నానంటే, ఇది అఫ్గానిస్తాన్ యొక్క విలువైన సాంస్కృతిక వారసత్వపు మైలురాయికి మళ్ళీ ప్రాణం పోసింది.
ఈ స్టోర్ పాలెస్ ఎన్నో మహత్వపూర్ణ చారిత్రక కార్యక్రమాలకు నిలయం. అఫ్గానిస్తాన్ లో హింసాత్మకమైన నీడలను తప్ప మరొకటి చూడలేని వారికి పునరుద్ధరించిన ఈ స్టోర్ ప్యాలెస్ అఫ్గానిస్తాన్ యొక్క ఘన సంప్రదాయాల ప్రాభవాన్ని గుర్తుకు తెస్తుంది.
మన అఫ్గాన్ సోదర సోదరీమణుల విషయానికి వస్తే, అఫ్గాన్ సమాజం తాలూకు శోభను, విశిష్టతను మరుగునపడ్డ వైభవోపేత స్మృతులను ఇది పున:ప్రతిష్టిస్తున్నదనే చెప్పాలి.
మన బంధాల పునాదికి మల్లేనే ఇది మన ప్రస్తుత స్నేహాన్ని చారిత్రక బంధంగా పెనవేయగల ఒక లంకె అని చెప్పవచ్చు. ఈ సున్నితమైన కార్యాన్ని తీర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేసిన కళాకారులు, నిపుణులు, సలహాదారులను అందరినీ నేను
అభినందించే తీరాలి.
స్నేహితులారా,
అఫ్గానిస్తాన్ ఆప్త మిత్రురాలు. మన సమాజాలు మరియు ప్రజలు యుగాల తరబడి సంబంధాలను పెనవేసుకున్న వారే.
అందువల్ల, వెలుపలి నుంచి ప్రేరేపితమైన శక్తులు, హింసాత్మకమైన తీవ్రవాదుల నుండి సవాలును ఎదుర్కొంటున్న మీ దేశాన్నిచూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది.
సంపన్నమైన అఫ్గానిస్తాన్ నిర్మాణానికి, మీ సమాజంలో శాంతి, రక్షణ, స్థిరత్వం తీసుకురావడానికి మీకు సహకరిస్తాని భరోసా ఇస్తున్నాను.
1.25 కోట్ల భారత ప్రజలు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు.
మన భాగస్వామ్యం యొక్క ప్రతిజ్ఞ, బలమైన స్నేహబంధం అఫ్గానిస్తాన్ ను స్థిరంగా ఉంచుతుంది. ఈనాటి కార్యక్రమము మనం సహకారంతో ప్రయత్నించి మన పరిధిలోగల వాటిని పరిష్కరించుకోగలమనడానికి సాక్ష్యం.
ఆర్థిక అభివృద్ధి యెక్క ఫలాలను ప్రతి అఫ్గాన్ పౌరుడూ అనుభవించాలన్నదే మా కోరిక. ఎన్ని అసమానతలు , అవాంతరాలున్నా అఫ్గాన్ లందరి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం భారతదేశం మీతో కలసి పనిచేస్తుంది.
శ్రేష్ఠ అధ్యక్షా,
చివరగా, అఫ్గాన్ లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను, అలాగే భారత రాయబార కార్యాలయాన్ని, రాయబారులకు తగిన భద్రత, రక్షణ కల్పిస్తున్న మీకు, మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అఫ్గాన్ సోదరుల ప్రాణత్యాగాలను మరువలేము.
ఈరోజు మిమ్మల్నిలా కలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా(నేరుగా) కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను. నవీకరించిన స్టోర్ పాలెస్ ను చూసే అవకాశం ఏదో ఒక రోజు లభిస్తుందని ఆశిస్తున్నాను.
మీకు చాలా ధన్యవాదములు.
Today's video inauguration of Stor palace is an entirely different, yet in many ways more fundamental, dimension of our engagement: PM
— PMO India (@PMOIndia) August 22, 2016
I say this because it brings back to life a valuable landmark of Afghanistan's cultural heritage: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2016
Afghanistan is a close friend. Our societies and people have had age old ties and links: PM @narendramodi https://t.co/6wY2MFrge1
— PMO India (@PMOIndia) August 22, 2016
The pledge of our partnership and strength of our friendship with Afghanistan is unwavering: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2016