Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజతం సాధించిన శుభమ్‌ జుయాల్‌కు ప్రధానమంత్రి అభినందన


   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజత పతకం సాధించిన శుభమ్ జుయాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

శుభమ్‌ జుయాల్‌ అద్భుత క్రీడా నైపుణ్యాన్ని, ఈ క్రీడపైగల అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

ఈ గెలుపు ఆయనను మరిన్ని గొప్ప విజయాలవైపు నడిపించగలదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“కామన్వెల్త్ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజత పతక విజేత శుభమ్ జుయాల్ విజయం నాతోపాటు దేశానికీ గర్వకారణం. ఆయన క్రీడా నైపుణ్యం, అంకితభావం ప్రశంసనీయం. ఈ గెలుపు ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాల వైపు నడిపించాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.