పిఎంఇండియా
కామన్ వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్న శ్రీ దీపక్ లాథర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘మన వెయిట్ లిఫ్టర్లు శ్రేష్ఠమైన ప్రదర్శనను ఇస్తున్నారు. పురుషుల 69 కిలోల విభాగంలో కాంస్యాన్ని నా యువ మిత్రుడైన శ్రీ దీపక్ లాథర్ గెలుచుకొన్నాడు. ఈ యువ ప్రతిభావంతుడికి ఇవే నా అభినందనలు. మరి ఆయన తన భావి ప్రయత్నాల లోనూ రాణించుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల 69 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన శ్రీ దీపక్ లాథర్, ఆ క్రీడలలో పతకాన్ని చేజిక్కించుకొన్న భారతీయ వెయిట్ లిఫ్టర్ల లో కెల్లా అత్యంత పిన్నవయస్సు కలిగినవాడుగా ఖ్యాతిని సంపాదించుకొన్నాడు.
***
Our weightlifters are in superb form! My young friend Deepak Lather wins a Bronze in the Men's 69 kg category. Congratulations to this youngster and all the best for his future endeavours: PM @narendramodi #GC2018 @GC2018 pic.twitter.com/H93XVJnFhh
— PMO India (@PMOIndia) April 6, 2018