Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర సైనికులకు ప్రధాన మంత్రి నివాళి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని భారతదేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క వీర సైనికునికీ నివాళులర్పించారు.

”కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నేను భారతదేశం కోసం తుది శ్వాస వరకు పోరు సల్పిన ప్రతి ఒక్క పరాక్రమవంతుడైన జవానుకూ నమస్కరిస్తున్నాను. వారి వీరోచిత త్యాగాలు మనకు ప్రేరణనిస్తున్నాయి.

సాహసులైన మన సైనికులు చొరబాటుదారులకు దీటైన రీతిలో, మరపునకు రాని విధంగా ఎలా బదులిచ్చారో ఆ జవాన్ల నిర్భయత్వాన్ని భారతదేశం ఎన్నటికీ విస్మరించబోదు .

1999 లో భారతదేశ రాజకీయ నాయకత్వం ప్రదర్శించిన స్థైర్యాన్ని, ఆ దృఢత్వం కార్గిల్ లో అందించిన నిర్ణయాత్మకమైన విజయాన్ని మనం గర్వంతో జ్ఞ‌ప్తికి తెచ్చుకొంటున్నాం” అని ప్రధాన మంత్రి అన్నారు.

***