పిఎంఇండియా
ఒప్పందాలు
|
1. |
భారత్–కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కోసం నిబంధనావళి |
· ప్రతిష్టాత్మకమైన, ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా చర్చలను ప్రారంభించడానికి నిబంధనావళి ఖరారైంది. · వస్తువులు, సేవల వాణిజ్యంతో పాటు, పరస్పరం అంగీకరించిన ఇతర విధానపరమైన అంశాలపై ఈ చర్చలు జరుగుతాయి. ఒక సమగ్రమైన, సమతుల్యమైన, ఇరు దేశాలకు మేలు చేసే విధంగా ఈ ఒప్పందాన్ని సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన నిర్మాణం, ఫ్రీక్వెన్సీ,పద్ధతులను ఈ నిబంధనావళి అందిస్తుంది. · ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత భారత్, కెనడాల మధ్య ఆర్థిక సంబంధాలను గణనీయంగా బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. |
|
2. |
సాంకేతికత, ఆవిష్కరణల్లో సహకారంపై భారత్–కెనడా–ఆస్ట్రేలియా త్రైపాక్షిక ఒప్పందం |
· ఆస్ట్రేలియా–కెనడా–భారత్ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామ్యం కింద అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణల్లో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం |
|
3. |
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్ కుండ్లీలోని ఉమ్మడి పప్పుధాన్యాల ప్రోటీన్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రకటన |
· భారతదేశం–కెనడా పప్పు ధాన్యాల ప్రోటీన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనువర్తిత ఆవిష్కరణల ద్వారా ఆహార శుద్ది సామర్థ్యాలను, పోషకాహార ఆధారిత ఆహార వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. · సూక్ష్మపోషక లోపాలను పరిష్కరించడానికి అధునాతన ప్రోటీన్ వెలికితీత, బలవర్థకమైన పప్పు ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. |
|
4. |
యురేనియం ఖనిజ సాంద్రీకృతాల సరఫరా కోసం భారత అణుశక్తి శాఖ, కెనడాకు చెందిన కామెకో సంస్థ మధ్య వాణిజ్య ఒప్పందం. |
· యురేనియం ఖనిజ సాంద్రీకృతాల సరఫరా కోసం కెనడాకు చెందిన కామెకో సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం · దేశంలో అణుశక్తి విస్తరణ దిశగా అత్యంత కీలకమైన చర్య. · వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారత్ లక్ష్యానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది |
|
5. |
గ్లోబలింక్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కెనడాలోని మిటాక్స్ మధ్య ఒప్పందం |
· కెనడియన్ విద్యాసంస్థల అధ్యాపక సభ్యుల పర్యవేక్షణలో సైన్స్, ఇంజనీరింగ్, గణితం నుంచి మానవీయ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం వరకు వివిధ విద్యా విభాగాల్లో 12 వారాల పూర్తి నిధులతో కూడిన పరిశోధన ఇంటర్న్‌షిప్‌ను చేపట్టడానికి ఏటా 300 మంది అర్హత కలిగిన భారతీయ విద్యార్థులకు మూడు సంవత్సరాల పాటు (2027 నుంచి) పూర్తిగా నిధులతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు. |
|
6. |
కీలక ఖనిజాల సహకారంపై ఒప్పందం |
· సురక్షితమైన, స్థితిస్థాపకమైన కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్, కెనడాల మధ్య కుదిరిన పరస్పర ప్రయోజనకరమైన సహకారం. · ఇరు దేశాల్లో పెట్టుబడుల ప్రోత్సాహాన్ని, ప్రాజెక్టుల గుర్తింపును సులభతరం చేస్తుంది. కీలక, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, గనుల తవ్వకం, లబ్ధి, సమర్థవంతమైన వెలికితీత కోసం ప్రాసెసింగ్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ పద్ధతుల మార్పిడిని ఇది ప్రోత్సహిస్తుంది. |
|
7. |
పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంపై ఒప్పందం |
· పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఇంధన నిల్వ, సౌర శక్తి, పవన శక్తి, బయోమాస్/బయో–ఇంధన రంగాల్లో సమాచార మార్పిడి, ఉత్తమ పద్ధతులు, అనుభవాల పాఠాలు, సామర్థ్య పెంపునకు తోడ్పాటునందిస్తుంది. |
|
8. |
సాంస్కృతిక సహకారంపై ఒప్పందం |
· సంస్కృతి, జ్ఞానాభివృద్ధి ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. · ఉమ్మడి ప్రాజెక్టులు, ప్రదర్శన కళలు, దృశ్య కళలు, ఇతర సృజనాత్మక పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సాంస్కృతిక కార్యకలాపాలను, సహకార ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. |
వరుస సంఖ్య | ఒప్పందం పేరు | వివరణ |
|---|
ముఖ్యమైన ప్రకటనలు
9. కృత్రిమ మేధ, వైద్యం, వ్యవసాయం, ఆవిష్కరణల వంటి రంగాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థల మధ్య 24 ఒప్పందాలు
10. ప్రపంచ జీవ ఇంధన కూటమిలో భాగస్వామిగా చేరనున్న కెనడా.
11.అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యదేశంగా చేరనున్న కెనడా.
12.హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్‌లో కెనడా చర్చల భాగస్వామిగా చేరడానికి భారత్ మద్దతు.
13. భారత్–కెనడా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ స్థాపన.
14. భారత్–కెనడా సీఈఓ ఫోరం పునర్నిర్మాణం–ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, ప్రాధాన్యతా రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలక వేదిక.
15. భారత్–కెనడా రక్షణ చర్చలు.
16. కెనడా విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కొత్తగా కెనడా–భారత్ ఉమ్మడి ప్రతిభ, ఆవిష్కరణ వ్యూహాన్ని ప్రారంభించడం .
17. 2026 మార్చి 17 నుంచి 30 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ ట్రైబ్స్ ఫెస్ట్‌లో కెనడా భాగస్వామ్యం.
***
Addressing the joint press meet with PM Mark Carney of Canada.@MarkJCarney https://t.co/p0PVHPlw0k
— Narendra Modi (@narendramodi) March 2, 2026
भारत और कैनेडा लोकतान्त्रिक मूल्यों में अटूट विश्वास रखते हैं।
— PMO India (@PMOIndia) March 2, 2026
हम diversity को celebrate करते हैं।
मानवता की भलाई हमारा साझा vision है।
यही vision हमें हर क्षेत्र में आगे बढ़ने की प्रेरणा देता है।
आज हमने इस vision को Next Level Partnership में transform करने पर चर्चा की: PM…
कैनेडा के pension funds ने भारत में 100 बिलियन डॉलर का निवेश किया है।
— PMO India (@PMOIndia) March 2, 2026
यह भारत की growth story में उनके गहरे विश्वास का प्रतीक है: PM @narendramodi
With Canada and India innovation partnership, we will turn ideas into global solutions: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2026
कृषि में value addition, agri-technology और खाद्य सुरक्षा हमारी साझा प्राथमिकताएं हैं।
— PMO India (@PMOIndia) March 2, 2026
इस दिशा में भारत में India-Canada Pulse Protein Centre of Excellence स्थापित किया जाएगा: PM @narendramodi
Civil Nuclear Energy में हमने long term uranium supply की landmark deal की है।
— PMO India (@PMOIndia) March 2, 2026
हम Small Modular Reactors और advanced reactors पर भी मिलकर काम करेंगे: PM @narendramodi
हमें ख़ुशी है कि कैनेडा ने International Solar Alliance और Global Biofuel Alliance से जुड़ने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) March 2, 2026
हमारे साझा प्रयासों को आगे बढ़ाने के लिए हम इस वर्ष India-Canada Renewable Energy and Storage Summit आयोजित करेंगे: PM @narendramodi
हम defence industries, maritime domain awareness और military exchanges बढ़ाने पर काम करेंगे।
— PMO India (@PMOIndia) March 2, 2026
इसी उद्देश्य से आज हमने India-Canada Defence Dialogue की स्थापना करने का निर्णय लिया है: PM @narendramodi
हम सहमत हैं कि Terrorism, Extremism और Radicalisation दोनों देशों के लिए ही नहीं, पूरी मानवता के लिए साझा और गंभीर चुनौतियाँ हैं।
— PMO India (@PMOIndia) March 2, 2026
इनके विरुद्ध हमारा करीबी सहयोग वैश्विक शान्ति और स्थिरता के लिए अत्यंत महत्वपूर्ण है: PM @narendramodi
पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है।
— PMO India (@PMOIndia) March 2, 2026
भारत dialogue और diplomacy के माध्यम से सभी विवादों के समाधान का समर्थन करता है।
इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे: PM @narendramodi