పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతులలో ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన కమిషన్ కాలం ప్రస్తుతం 2018 జూన్ 20 వ తేదీ వరకు ఉండగా దానిని 2018 జూలై 31 వరకు పొడిగించింది..
ఈ కమిషన్ రాష్ట్రప్రభుత్వాలు, రాష్ట్రాల వెనుకబడిన తరగతుల కమిషన్లు, వివిధ కమ్యూనిటీల సంఘాలు, వివిధ వెనుకబడిన తరగతులకు చెందిన సాధారణ ప్రజలు, ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. కమిషన్ ఒబిసిలలో కులాల వారీగా ఉన్నత విద్యాసంస్థలలో చేరిన వారి వివరాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాలలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో చేరిన వారికి సంబంధించి కులాల వారీగా వివరాలను సేకరించింది. కమిషన్ సేకరించిన వివరాలు సవివరంగా పరిశీలించడానికి కమిషన్ గడువును 2018 జూలై 31 వరకు పొడిగించాల్సిందిగా కోరింది.