Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళలోని త్రిస్సూర్‌ బాణసంచా పరిశ్రమలో ప్రమాదం… ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


కేరళలోని త్రిస్సూర్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘కేరళలోని త్రిస్సూర్‌లో ఒక బాణాసంచా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో అనేక మంత్రి ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని కలత చెందాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి’’

‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఇవ్వనున్నట్లు  ప్రధానమంత్రి ప్రకటించారు’’.

***