Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్‌క‌తాలోని బేలూర్ మ‌ఠం లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగం పాఠం


రామ‌కృష్ణ మ‌ఠం జ‌న‌రల్ సెక్ర‌ట‌రి శ్రీ స్వామి సువిరానందా జీ మ‌హారాజ్‌, స్వామి దివ్యానంద్ జీ మ‌హారాజ్‌, మాననీయ ప్ర‌ముఖులు, అతిథులు, ఇక్క‌డ కు విచ్చేసినటువంటి నా యొక్క యువ మిత్రులారా,

మీకు అంద‌రి కి ఈ పవిత్రమైనటువంటి శ్రీ స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భం లో జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం అయినటువంటి ఈ రోజు న అనేకానేక శుభాకాంక్ష‌లు. ఈ పావన బేలుడ్ మ‌ఠాని కి రావ‌డం ఈ దేశ ప్ర‌జ‌ల‌ కు ఒక తీర్థ‌యాత్ర‌ కన్నా త‌క్కువది ఏమీ కాదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ స్వంత ఇంటికి వ‌చ్చిన‌ట్టే ఉంటుంది. గ‌త‌ రాత్రి నేను ఇక్క‌డ బ‌స‌ చేయ‌డానికి రామ‌కృష్ణ మ‌ఠం అధ్య‌క్షులైన స్వామీజీ కి, మ‌ఠం నిర్వాహ‌కులంద‌రి కి నేను కృత‌జ్ఞ‌త‌లు తెల‌పుకుంటున్నాను. ప్రొటోకాల్స్‌, భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాలు ఎన్నో ఇమిడివుంటాయి క‌నుక‌, ప్ర‌భుత్వాని కి కూడాను నేను ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను. నా విజ్ఞ‌ప్తి ని వ్య‌వ‌స్థ మ‌న్నించింది. ఈ ప‌విత్ర భూమి లో ఒక రాత్రి బ‌స‌ చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. ఈ మ‌ట్టిలో, ఈ గాలి లో స్వామి రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌, శార‌ద మాత‌, స్వామి బ్ర‌హ్మానంద‌, స్వామి వివేకానందుల వారు వంటి మ‌హ‌నీయు గురు ప‌రంప‌ర అందించిన సారాన్ని అనుభ‌వం లోకి తెచ్చుకోగ‌లుగుతారు. ఎప్పుడు నేను బేలుడ్ మ‌ఠాని కి వ‌చ్చినా, ఆ నాటి మ‌హ‌నీయ స్మృతుల‌ ను నెమ‌రువేసుకుంటూ వుంటాను. అందుకే నేను ఈ రోజు న ఇక్క‌డ ఉన్నాను. 130 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ కు సేవ చేసే కొన్ని బాధ్య‌త‌ల‌ ను నేను నెర‌వేర్చ‌గ‌లుగుతున్నాను.

గ‌తం లో నేను ఇక్క‌డ‌ కు వ‌చ్చిన‌పుడు, నేను గురువు గారు, స్వామి ఆత్మ‌ ఆస్థానంద్‌ గారి యొక్క ఆశీస్సులు వెంట తీసుకుపోయాను. వారు నా వేలి ని ప‌ట్టుకుని ‘మాన‌వ సేవే మాధ‌వ సేవ’ అని మార్గం చూపించారు. ఇవాళ వారు మ‌న మ‌ధ్య భౌతికం గా లేరు. కానీ వారు చేసిన‌టువంటి ప‌నులు, చూపినటువంటి మార్గం ఎల్ల‌ప్పుడూ రామ‌కృష్ణ మిశన్ రూపం లో మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే వుంటాయి.

ఇక్క‌డ అనేక మంది బ్ర‌హ్మ‌చారులు కూర్చుని వున్నారు. వారి తో కొద్ది నిమిషాలు గ‌డిపేటటువంటి ఒక అవ‌కాశం నాకు చిక్కింది. మీరు ఇప్పుడు ఉన్న మాన‌సిక స్థితి ఒక‌ప్ప‌టి నా మాన‌సిక స్థితి వంటిదే. మ‌నలో చాలా మందిమి ఇక్క‌డ కు ఆక‌ర్షితులు కావ‌డానికి కార‌ణం స్వామి వివేకానందుల వారి యొక్క వ్య‌క్తిత్వం, వారి యొక్క మాట‌, వారి యొక్క ఆలోచ‌న‌ లే. ఇది మీ అనుభ‌వం లో గ‌మ‌నించి వుంటారు. అయితే ఈ ప‌విత్ర‌మైనటువంటి గ‌డ్డ‌ మీద అడుగు పెట్టిన త‌రువాత శార‌ద మాత ఒడి మ‌న‌కు త‌ల్లి ప్రేమ‌ ను పంచి మ‌న‌లను ఇక్క‌డే ఉండేట్టు చేస్తుంది. ఇక్క‌డి బ్ర‌హ్మ‌చారులంతా ఇదే భావ‌న‌ తో ఉండి వుంటారు.

మిత్రులారా, స్వామి వివేకానందుల వారు మూర్తీభ‌వించినటువంటి ఒక వ్య‌క్తిత్వం మాత్ర‌మే కాదు, ఒక జీవ‌న విధానం, ఒక జీవ‌న శైలి. ద‌రిద్ర‌ నారాయ‌ణుల‌ కు సేవ‌ల చేయ‌డం, భార‌త‌దేశం ప‌ట్ల భ‌క్తి ని క‌లిగివుండ‌టం అనేవి త‌న జీవితాని కి ఆది, అంతమూ అని వారు భావించారు. వారు అటువంటి జీవితాన్ని గ‌డిపారు. ఈ రోజు కు కూడాను కోట్ల మంది కి మార్గ‌ద‌ర్శి గా నిలచారు.

దేశ యువత కు వివేకానంద గారి ని గురించి తెలుసో లేదో అని కాకుండా ఒక విశ్వాసం తో నేను ఒక మాట ను చెబుతున్నాను. వీరంద‌రు కూడా తెలిసి గాని, లేదా తెలియ‌క గాని ఇదే సంక‌ల్పం లో భాగ‌స్వాములు. కాలం మారింది; ద‌శాబ్దాలు మారాయి; శ‌తాబ్దం మారింది. కానీ, స్వామీజీ సంక‌ల్పాన్ని సాకారం చేయ‌వ‌ల‌సిన బాధ్య‌త మ‌నంద‌రి మీద‌, రాబోయే త‌రాల‌ మీద ఉంటుంది. సమయం మారిపోయింది; దశాబ్దాలు మారిపోయాయి; శతాబ్దం మారిపోయింది, కానీ స్వామీజీ తీర్మానాన్ని నెరవేర్చవలసినటువంటి ఒక బాధ్యత మన మీద, అలాగే రాబోయే తరాల మీద ఉంది. మరి అది ఒకసారి చేస్తే పూర్తి అయ్యేటటువంటి విషయం కాదు. ఇది ప్రాక్టీస్ చేసే పని, యుగయుగాలు గా నిరంతరం చేయవలసినటువంటి కార్యం. ఒక సారి చేస్తే ముగిసిపోయేది కాదిది. ఇది ఆచ‌రణాత్మ‌కమైన ప‌ని. దీని ని నిరంత‌రం త‌ర‌త‌రాలు గా కొన‌సాగిస్తూ వుండాలి.

అనేక పర్యాయాలు మ‌నం అనుకుంటూ ఉంటాము.. నేను ఒక్కరినే చేస్తే ఏం మార్పు వ‌స్తుంది? అని. నేను చెప్పేది ఎవ‌రూ విన‌రని, ఎవ‌రూ నేను ఏం చెబుతున్నాన‌న్న‌ దానిని ప‌ట్టించుకోర‌ని అనుకుంటూ ఉంటారు. యువ‌త ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌ ల నుండి బ‌య‌ట‌ప‌డాలి. నేను గురువు ల వ‌ద్ద నేర్చుకున్న సుల‌భ‌మైన మంత్రాన్ని చెబుతాను చూడండి. మ‌నం ఎప్పుడూ ఒంట‌రి కాదు. మ‌న తో ఎల్ల‌ప్పుడూ ఎవ‌రో ఒక‌రు ఉంటారు. కానీ వారిని మనం చూడ‌లేం. అదే భ‌గ‌వ‌త్ స్వ‌రూపం. మ‌నం ఏనాడూ ఒంట‌రి కాద‌ని గ‌మ‌నించండి. మ‌న సృష్టిక‌ర్త అనుక్ష‌ణం మ‌న వెన్నంటి వుంటారు.

వంద‌ మంది ఉత్సాహ‌వంతులైన‌ యువ‌త నాకు లభిస్తే, నేను భార‌త‌దేశం యొక్క రూపురేఖ‌ల ను మార్చివేస్తాన‌న్న స్వామీజీ మాట‌ల ను మ‌నం ఎల్ల‌ప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. త‌న వ‌ద్ద వంద‌ మంది ప్ర‌జ‌లు ఉంటే అత‌డు ఏదో అవుతాడ‌ని స్వామీజీ ఏనాడూ చెప్ప‌లేదు. ఆయ‌న అలా అనలేదు. అందుకు బ‌దులు గా భారతదేశం మారుతుంద‌న్నారు. అదీ మ‌న శ‌క్తి. మార్పుసాధించేందుకు ఏదో చేయాల‌న్న త‌ప‌న చాలా ముఖ్యం.

స్వామీజీ ,అలాంటి వంద మంది యువ‌త కోసం ఆనాటి బానిస పాల‌న కాలం లో ఎదురుచూశారు. కానీ ఇవాళ 21వ శ‌తాబ్దాన్ని భార‌త‌దేశపు శ‌తాబ్దం గా మలచడం కోసం న‌వ‌ భార‌తాన్ని నిర్మించడం కోసం ఉత్సాహ‌వంతులైన యువ‌త దేశం న‌లుమూల‌లా సిద్ధం గా ఉంది. ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద సంఖ్య లో గల యువ‌జ‌న ఖజానా అనేది భార‌త‌దేశం దగ్గర ఉంది.

మిత్రులారా,21వ శ‌తాబ్దపు ఈ దేశ యువ‌త‌ పైన యావత్తు ప్ర‌పంచానికే ఎన్నో ఆశ‌ లు ఉన్నాయి. మీకు అంద‌రికీ తెలుసు.. 21వ శ‌తాబ్దానికి, న‌వ‌ భార‌తాన్ని నిర్మించేందుకు, దేశం స్థిర సంక‌ల్పం తో ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంది. ఈ సంకల్పాలు కేవ‌లం ప్ర‌భుత్వానివి కావు. ఈ సంకల్పాలు 130 కోట్ల దేశ ప్ర‌జ‌ల‌ యొక్క సంకల్పాలు; ఈ సంకల్పాలు ఈ దేశ యువ‌త‌ యొక్క సంకల్పాలు.

గత 5 సంవత్సరాల అనుభవాన్ని బ‌ట్టి చూస్తే, దేశం లోని యువత భాగ‌స్వాములు అయ్యే కార్య‌క్ర‌మాలు విజయవంతం కావడం ఖాయం అని తెలుస్తోంది. దేశం పరిశుభ్రం గా మారగలదా లేదా అనే దాని పై 5 సంవత్సరాల క్రితం వరకు నిరాశావాద భావన ఉంది. కానీ దేశంలోని యువత రంగం లోకి దిగింది, మార్పు కనిపిస్తోంది.

నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు, భారతదేశం లో డిజిటల్ చెల్లింపుల విస్తరణ గురించి చాలా మంది కి తెలియదు. కానీ నేడు, భారతదేశం ప్రపంచం లో శ‌ర‌వేగం తో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గా తనదైన బలం తో నిలబడివున్నది.

అవినీతి కి వ్యతిరేకం గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు దేశం లోని యువత వీధులలోకి వ‌చ్చిన విష‌యం కూడా మ‌నం చూశాము. ఆ కాలం లో, దేశం లో వ్యవస్థ ను మార్చడం కష్టం గా అనిపించింది. కానీ యువత ఈ మార్పు ను కూడా తీసుకువచ్చింది.

మిత్రులారా, 21 వ శతాబ్దపు ఈ దశాబ్దం లో, భారతదేశాన్ని మార్చడానికి యువత అభిరుచి, యువత యొక్క శక్తులే కీల‌కం. ఒక విధంగా చెప్పాలంటే, 2020వ సంవత్సరం జనవరి నెల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రారంభమవుతుంది. అయితే ఇది కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త దశాబ్దం ప్రారంభం కూడా అని గుర్తుంచుకుందాం. కాబట్టి మన కలల ను ఈ దశాబ్దపు సంకల్పం తో మరింత శక్తి తో జ‌త‌ చేసి మ‌రింత‌ ఉత్సాహం తో, అంకిత‌భావం తో వీటి సాకారాని కి కృషి చేయాలి.

న‌వ‌భారత దేశానికి సంబంధించిన సంక‌ల్పం నెరవేరవలసింది మీతోనే. ఇది యువత యొక్క ఆలోచనయే ఇది ఏమని చెబుతోందంటే సమస్య‌ల‌ ను వాయిదా వేయకూడదని. మీరు యువతే అయితే గనక సమస్య ల నుండి పారిపోవడం గురించి మీరు ఎన్న‌డూ ఆలోచించరు. యువత అంటే- అతడు గాని లేదా ఆమె గాని- సమస్యల ను ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌లిగిన వారు. వారు సమస్యల ను పరిష్కరించ‌గ‌ల‌రు, అంతే కాదు సవాళ్లనే స‌వాలు చేయ‌గ‌ల‌రు. ఈ ఆలోచన ను అనుసరించి, దేశం ఎదుర్కొంటున్న దశాబ్దాల నాటి సవాళ్ల ను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది.

మిత్రులారా, గత కొంత కాలం లో దేశం లోను, యువ వర్గాల లోను పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం గురించి ఎంతో చ‌ర్చ చోటు చేసుకొంది. అస‌లు ఏమిటి ఈ చ‌ట్టం? ఈ చ‌ట్టాన్ని తీసుకు రావ‌ల‌సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది ? యువ‌తీయువకుల మ‌న‌స్సుల లో మాదిరే ప్ర‌జ‌ల మ‌న‌స్సులలోనూ ఎన్నో సందేహాలు. నిజాని కి చాలా మంది యువ‌త‌ కు దీని ని గురించి తెలుసును. అయితే కొంద‌రు అయోమ‌యం కార‌ణం గా బాధితులు అవుతున్నారు. వదంతుల కు బాధితులు అవుతున్నారు. అందువ‌ల్ల అటువంటి ప్ర‌తి యువ‌కుడి సందేహాల ను నివృత్తి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌.

అందువ‌ల్ల జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సంద‌ర్భం లో యువ‌కులు పెద్ద‌ సంఖ్య‌ లో ఇక్క‌డ హాజ‌రైనందున‌, నేను మ‌రో సారి ఈ ప‌విత్ర‌ భూమి నుండి ఈ దేశ యువ‌త‌ కు, ప‌శ్చిమ‌ బెంగాల్ యువ‌త‌కు, ఈశాన్య ప్రాంత యువ‌త‌ కు కొన్ని విష‌యాల ను చెప్ప‌ద‌ల‌చుకున్నాను.

మిత్రులారా,

దేశ పౌర‌స‌త్వాని కి సంబంధించి రాత్రి కి రాత్రి భార‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తీసుకురాలేదు. అంద‌రూ తెలుసుకోవ‌ల‌సిన విష‌యం ఏమిటంటే, మ‌రో దేశాని కి చెందిన, ఏ మ‌తాని కి చెందిన వ్య‌క్తి అయినా, భార‌తదేశం పై విశ్వాసాన్ని ఉంచి , భార‌తదేశ రాజ్యాంగాన్ని శిర‌సావ‌హిస్తే అటువంటి వారు భార‌తదేశపు పౌర‌స‌త్వాన్ని తీసుకోవ‌చ్చును. ఇందులో ఎటువంటి సందేహాని కి తావు లేదు. దీని ని మ‌రింత వివ‌రం గా చెబుతాను. పౌర‌స‌త్వ చ‌ట్టం అనేది పౌర‌స‌త్వాన్ని లాగివేసుకొనేటటువంటి చ‌ట్టం కాదు. ఇది పౌర‌స‌త్వాన్ని మంజూరు చేసే చ‌ట్టం. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం అనేది ఈ చ‌ట్టానికి ఒక‌ స‌వ‌ర‌ణ మాత్ర‌మే. మ‌రి ఈ స‌వ‌ర‌ణ ఏం చెబుతోంది ? భార‌తదేశ పౌర‌స‌త్వాన్ని పొందే ప్ర‌క్రియ‌ ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఈ మార్పుల ను మేము తీసుకువ‌చ్చాం. ఎవ‌రి కోసం దీనిని తీసుకు వ‌చ్చాము? పాకిస్తాన్ విభ‌జ‌న అనంత‌రం త‌మ మ‌తం కార‌ణం గా అణచివేత‌ కు,వేద‌న‌ కు గురి అవుతూ జీవితాన్ని కొన‌సాగించ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్న వారికి ఉద్దేశించింది. సోదరీమ‌ణుల, ఆడ‌బిడ్డ‌ ల గౌరవానికి భ‌ద్ర‌త లేకుండా పోయింది. అనేక స‌ంకటాల తో మనుగడే చుట్టుముట్టివేయబడింది.

మిత్రులారా,

స్వాతంత్ర్యం సిద్ధించిన అనంత‌రం, పాకిస్తాన్‌ లో మ‌తం కార‌ణం గా వేద‌న‌ కు గురి అవుతున్న ఇలాంటి ప్ర‌జ‌ల‌కు పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని పూజ్య మ‌హాత్మా గాంధీ వంటి మ‌హా నాయ‌కులు చెప్పారు. నేను ఇప్పుడు మిమ్మ‌ల్ని అడుగుతున్నాను.. చెప్పండి; ఇటువంటి శ‌రణార్థుల‌ ను చ‌నిపోవ‌డానికి వెనుకకు పంపాలా ? మ‌నం వారిని వెనుకకు పంపివేయాలా ? మ‌న‌కు బాధ్య‌త ఉందా? లేక మనకు బాధ్యత లేదా ? వారి ని మన దేశ‌ పౌరుల‌ తో స‌మానం గా చేయ‌వలసిన అటువంటి అవ‌స‌రం ఉందా? లేక అటువంటి అవసరం లేదా? వారు ఈ దేశ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి సంతోషం గా జీవిస్తాం అటే, మ‌న‌కు సంతృప్తేనా, కాదా ? ఇది ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మ‌మా, కాదా ? మ‌నం ఈ ప‌ని చేయ‌న‌వ‌స‌రం లేదా ? ఇత‌రుల సంక్షేమం కోసం పాటు ప‌డ‌డం చెడ్డ‌ ప‌ని అవుతుందా ? మోదీ అటువంటి ప‌ని ని చేస్తే ఆయ‌న‌ కు మీ మ‌ద్ద‌తు ల‌భిస్తుందా? చేతులు పైకి ఎత్తి పట్టుకొని మీరు నాతో ఉన్నారో, నాతో లేరో చెప్పండి.

మా ప్ర‌భుత్వం ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మ‌హ‌నీయుల ఆకాంక్ష‌ల‌ ను నెర‌వేర్చింది. మ‌హాత్మా గాంధీ చేయ‌ండంటూ సూచించి వెళ్లారో ఆ ప‌ని ని మేము చేశామండీ. ఆ ర‌కం గా మ‌నం, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ద్వారా మేము పౌర‌స‌త్వాన్ని కల్పిస్తూనే వున్నాము; ఎవ‌రికి అయినా.. ఎవ‌రి పౌర‌స‌త్వాన్ని అయినా సరే లాగివేసుకోవడం లేదు.

దీనికి తోడు, ఇవాళ్టికీ, ఏ మ‌తాని కి చెందిన వ్య‌క్తి అయినా, దైవం పట్ల న‌మ్మ‌కం కలిగి వున్నా, దైవం పట్ల నమ్మకం అనేది లేక‌పోయినా భార‌తదేశ రాజ్యాంగానికి క‌ట్టుబ‌డిన వ్య‌క్తి నిర్దేశిత ప్ర‌క్రియ ప్ర‌కారం భార‌త పౌర‌స‌త్వాన్ని తీసుకోవ‌చ్చును. మీకు స్ప‌ష్టం గా అర్థం అయిందా, అర్థం కాలేదా ? చిన్న పిల్ల లు అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకున్నారు. కానీ రాజ‌కీయ క్రీడ‌లు ఆడే వారు మాత్రం దీని ని అర్థం చేసుకొనేందుకు సిద్ధం గా లేరు. వారు తెలివైన‌ వారే, కానీ వారు అర్థం చేసుకోద‌ల‌చుకోలేదు. మీరు ఎంతో సున్నిత‌మైన‌ వారు. యువ‌త‌ గా ఈ దేశ సంక్షేమాన్ని మీరు కోరుకొంటారు.

మరి అవును, ఈశాన్య రాష్ట్రాల విష‌య‌మే తీసుకోండి. ఈశాన్య రాష్ట్రాలు మ‌నకు గ‌ర్వ కార‌ణం గా నిలుస్తాయి. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ పై ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ వ‌ల్ల‌ ఎటువంటి వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డ‌కుండా హామీ ని ఇవ్వ‌డం జ‌రిగింది. అంతే కాదు అక్క‌డి జ‌నాభా, వారి ఆచార‌ వ్య‌వహారాలు, వారి జీవ‌న విధానం, వారి ఆహారపు అల‌వాట్ల పై వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డ‌కుండా చూడ‌టం జ‌రిగింది. ఇందుకు సంబంధించి కేంద్ర‌ ప్ర‌భుత్వం కొన్ని ఏర్పాట్లను చేసింది కూడా.

మిత్రులారా,

విష‌యం ఇంత‌ స్ప‌ష్టంగా ఉంటే, కొంద‌రు మాత్రం వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి సంబంధించి నిరంత‌రాయం గా వదంతుల ను వ్యాపింప చేస్తున్నారు. ఇవాళ్టి యువ‌త అటువంటి వారి లో నెల‌కొన్న అయోమయాన్ని తొల‌గిస్తుండ‌టం సంతోషాన్ని క‌లిగిస్తోంది.

పైపెచ్చు, పాకిస్తాన్‌ లో ఇత‌ర మ‌తాల యువ‌త‌ పై జ‌రుగుతున్న హింస‌ పై, అన్యాయం పై ప్ర‌పంచ‌వ్యాప్తం గా గ‌ల మ‌న యువ‌త త‌మ గ‌ళం బ‌లం గా వినిపిస్తున్న‌ది. ఇంకొక విష‌యం కూడా సుస్ప‌ష్టం. మ‌నం ఈ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం తీసుకు రాకుండా ఉండివుంటే, ఇది వివాదాన్ని రేకెత్తించ‌కుంటే అల్ప సంఖ్యాక వర్గాల వారి పై పాకిస్తాన్‌ లో జ‌రుగుతున్న నేరాలు గాని, అక్క‌డ ఏ విధం గా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతున్న‌ద‌న్న‌దని గాని, సోద‌రీమ‌ణులు, ఆడ‌బిడ్డ‌ ల జీవితాలు ఏవిధం గా నాశ‌న‌ం అవుతున్నాయ‌న్న‌ది కానీ ప్ర‌పంచానికి క‌నీసం తెలిసేది కూడా కాదు. మేం తీసుకొన్న చొరవ కారణం గా ప్రస్తుతం పాకిస్తాన్ కు గ‌త 70 సంవ‌త్స‌రాలు గా మైనారిటీల‌ పై ఎందుకని ఇటువంటి నేరాల కు ఒడిగట్టిందీ సమాధానం ఇవ్వవలసిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మిత్రులారా,

జాగరూకత ను క‌లిగి వుండ‌డం, జాగరూకత ను వ్యాపింపచేయడం మ‌రియు ఇత‌రులు సైతం జాగరూకతను పొందేటట్టు చూడటం కూడా మ‌న బాధ్య‌తే.  సామాజిక అవ‌గాహ‌న, ప్ర‌జా ఆందోళ‌న మ‌రియు సార్వ‌జ‌నిక స్పృహ లు అవ‌స‌రం అయిన‌టువంటి అంశాలు జలం వలె అనేకం ఉన్నాయి. నీటి ని ఆదా చేయ‌డం అనేది ప్ర‌స్తుతం పౌరుల లో ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యం గా మారిపోతున్న‌ది.  అది ప్లాస్టిక్స్ ను ఒక‌సారి వాడ‌టాని కి వ్య‌తిరేకం గా ప్ర‌చార ఉద్య‌మం కావ‌చ్చు, లేదా పేద‌ ప్రజల కోసం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న బోలెడు ప‌థ‌కాలు కావ‌చ్చు, మీ యొక్క స‌హ‌కారం ఈ అన్ని అంశాల విష‌యం లో జాగృతి ని పెంచ‌డం లో దేశాని కి ఎంతో స‌హాయ‌కారి అవుతుంది.

మిత్రులారా,

పౌరులు గా మ‌న విధుల‌ ను మ‌రియు మ‌న క‌ర్త‌వ్యాల‌ ను నిజాయ‌తీ తో, సంపూర్ణ స‌మ‌ర్ప‌ణ భావం తో మ‌నం నిర్వ‌హిస్తామ‌ని మ‌న రాజ్యాంగం మ‌రియు మ‌న సంస్కృతి అపేక్షిస్తాయి.  స్వాతంత్య్రం ల‌భించిన 70 సంవ‌త్స‌రాల కాలం లో హ‌క్కు ల విష‌యమై మ‌నం ఎంతో విని ఉన్నాము.  అలాగే, హ‌క్కుల కు సంబంధించి ప్ర‌జ‌ల దృష్టి కి తీసుకు రావ‌డం జ‌రిగింది.  అది అవ‌స‌రం కూడాను.  అయితే ప్ర‌స్తుతం, ఒక్క హ‌క్కు లే కాకుండా భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి విధి ని కూడా అంతే స‌మాన‌మైన ప్రాముఖ్యం క‌లిగిన అటువంటిది గా ప‌రిగ‌ణించాలి.  మ‌రి ఈ మార్గం లో పయనించడం ద్వారా, భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ వేదిక మీద దాని స్వాభావిక స్థానం లో మనం చూడ‌గ‌లుగుతాము.  భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద నుండి స్వామి వివేకానందుల వారు కోరుకున్న‌ది మ‌రియు ఈ సంస్థ యొక్క కేంద్ర స్థానం లో ఉన్న‌ది కూడా ఇదే.

స్వామి వివేకానందుల వారు దీనినే అభిల‌షించారు.  ఆయ‌న భ‌ర‌త మాత ను ఒక దివ్య‌మైనటువంటి రూపం లో చూడాల‌ని ఆకాంక్షించారు.  మ‌రి వారి స్వ‌ప్నాలు ఫ‌లించేట‌ట్లుగా చూడ‌టానికి మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రం సంక‌ల్పించుకొన్నాము.  ఈ రోజు న మ‌రొక్క‌మారు స్వామి వివేకానందుల వారి జ‌యంతి తాలూకు మంగ‌ళ‌ప్ర‌ద‌మైన‌టువంటి సంద‌ర్భం లో ఈ పావ‌న‌మైన బెలుడ్ మ‌ఠం లోని పూజ్య సాధువుల తో అమితోత్సాహం తో కొంత స‌మ‌యాన్ని వెచ్చించే అవ‌కాశం నాకు లభించింది.  పూజ్యులైన స్వామి వివేకానందుల వారు బ‌స చేసిన‌టువంటి గ‌ది లో దీర్ఘ‌ కాలం గ‌డిపే అవ‌కాశం ఈ రోజు ఉద‌యం నాకు ద‌క్కింది.  ఒక ఆధ్యాత్మిక స్పృహ మ‌రియు ఆధ్యాత్మిక‌మైన‌ భావనాత్మకమైన తరంగం అక్క‌డ నెల‌కొని ఉన్నాయి.  ఆ వాతావ‌ర‌ణం లో ఈ రోజు ఉద‌యం నా యొక్క జీవ‌నం లో అతి అమూల్య‌మైన‌టువంటి కాలాన్ని గ‌డ‌ప‌గ‌లిగాను.  పూజ్యులైన స్వామి వివేకానందుల వారు మ‌రింత ఎక్కువ కృషి చేయ‌వ‌ల‌సిందిగా నాకు ప్రేర‌ణ‌ ను అందిస్తున్న‌ట్టు, నాకు ఒక నూత‌న శ‌క్తి ని ప్ర‌సాదిస్తున్న‌ట్టు, మ‌రి నా స్వీయ సంక‌ల్పాల కు ద‌న్ను గా నిలుస్తున్న‌ట్టు నేను అనుభూతి కి లోనయ్యాను.  ఈ స్ఫూర్తి తో, ఈ నూత‌న శ‌క్తి తో, మీ అంద‌రి యొక్క ప్రోత్సాహం తో, ఈ గ‌డ్డ యొక్క దీవెన‌ల తో నేను మ‌రొక్క‌మారు అవే క‌ల‌ల ను నెర‌వేర్చేందుకు ముందుకు సాగుతాను.  నేను ప్ర‌య‌త్నాల ను కొన‌సాగిస్తూనే ఉంటాను.  మ‌న‌కు సాధు జ‌నులంద‌రి ఆశీర్వాదాలు ప్రాప్తించుగాక‌.  మీకు అంద‌రికీ ఇవే నా శుభాకాంక్ష‌లు.  స్వామీజీ స‌దా ఈ విధం గా అంటూ ఉండే వారు..  ప్ర‌తి దాని ని మ‌ర‌చిపొండి.  భ‌ర‌త‌ మాత ను మీ యొక్క దేవత‌ గా ఎంచండి.  మ‌రి ఆవిడ కోసం ప్ర‌తి ఒక్క ప్ర‌య‌త్నాన్ని చేస్తూ పొండి.  ఇదే స్ఫూర్తి తో, నాతో పాటు మీ పిడికిళ్ళ‌ ను ఎత్తి ప‌ట్టుకొని, బిగ్గ‌ర గా ఈ మాట లు ప‌ల‌కండి –

భార‌త‌ మాతా కీ జ‌య్‌.

భార‌త‌ మాతా కీ జ‌య్‌.

భార‌త‌ మాతా కీ జ‌య్‌.

అనేకానేక ధ‌న్యవాదాలు.

**********