Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్ కతా లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవ‌ర్ కూలిపోయిన దరిమిలా ఏర్పడిన పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో ప్రధాన మంత్రి సంభాషణ; కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్ కతా లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవ‌ర్ కూలిపోయిన దరిమిలా ఏర్పడిన పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో మాట్లాడారు.

కోల్ కతా లో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. కేంద్రం చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

***