Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌చ్ లో డీజీపీ ల స‌మావేశం సంద‌ర్భంగా వేర్వేరు విష‌యాల ఆధారంగా జ‌రిగిన స‌ద‌స్సుల‌లో పాల్గొన్న‌ ప్ర‌ధాని

క‌చ్ లో జ‌రుగుతున్న డీజీపీ ల స‌మావేశం రెండో రోజున వేర్వేరు విష‌యాల ఆధారంగా జ‌రిగిన స‌ద‌స్సుల‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలు పంచుకున్నారు.
అంత‌కుముందు ఉద‌యం పూట‌, ప్ర‌తినిధుల‌తో క‌ల‌సి యోగ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ద వైట్ ర‌ణ్ లో సూర్యోద‌యాన్ని వీక్షించారు.
పోలీసు వ్య‌వ‌స్థ‌కు చెందిన వివిధ అంశాల‌పై రూపొందించిన ప్రెజెంటేష‌న్‌ ల‌ను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రిశీలించారు; ఉగ్ర‌వాదం, సైబ‌ర్ భ‌ద్ర‌త‌, డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, విప‌త్తుల వేళ చేప‌ట్టే కార్యాచ‌ర‌ణలు స‌హా భ‌ద్ర‌తా సంబంధ‌మైన విష‌యాల‌పై జరిగిన కార్యక్రమాలకు హాజరై, అందులో జ‌రిగిన‌ చర్చలను ఆలకించారు. వివిధ ప్రెజెంటేష‌న్ లు, అల్ప విరామంతో కూడిన స‌ద‌స్సులు, భోజ‌న వేళ కొన‌సాగిన ప‌ర‌స్ప‌ర సంప్ర‌దింపులు.. ఇవ‌న్నీ క‌లుపుకొని ఈ రోజు మొత్తం 13 గంట‌ల పాటు కొన‌సాగాయి. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్‌, ఇంకా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రులు శ్రీ కిరెన్ రిజిజూ, శ్రీ హ‌రిభాయ్ పార్థీభాయ్ చౌద‌రి లు కూడా ఈ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు.