Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌స్ట‌మ్స్ విషయాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హాయం మరియు స‌హ‌కారం పై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


క‌స్ట‌మ్స్ వ్య‌వ‌హారాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హాయంతో పాటు స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి మ‌రియు ఆ ఒప్పందానికి అనుమోదం తెల‌ప‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఆయా ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపిన త‌రువాత రెండు దేశాల ప‌క్షాన ఈ ఒప్పందం పై సంత‌కాలు జ‌రుగుతాయి. ఈ ఒప్పందం అమ‌లులోకి రావ‌డానికి గాను అవ‌స‌ర‌మైన జాతీయ చ‌ట్ట‌బ‌ద్ధ చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డం పూర్తి అయిన‌ట్లుగా ఒప్పందాన్ని కుదుర్చుకొనే ప‌క్షాలు దౌత్యపరంగా నోటిఫై చేసి తద్వారా ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం సమాచారమిచ్చుకొన్న తరువాత రెండో నెల లోని ఒక‌టో తేదీ నాటి నుండి అమ‌లు లోకి వస్తుంది.

ఈ ఒప్పందం క‌స్ట‌మ్స్ నేరాల నివార‌ణకు, ద‌ర్యాప్తునకు కావ‌ల‌సిన స‌మాచారం ల‌భ్యమ‌య్యేట‌ట్లు తోడ్ప‌డ‌గలదు. అంతేకాకుండా ఈ ఒప్పందం ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని సుగ‌మం చేయ‌డంతో పాటు వ‌స్తువుల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ సమ‌ర్థంగా జ‌రిగేటట్లు చూస్తుంద‌ని భావిస్తున్నారు.

పూర్వ‌రంగం:

ఈ ఒప్పందం ఇరు దేశాల క‌స్ట‌మ్స్ అధికారులు స‌మాచారాన్ని, ర‌హ‌స్య స‌మాచారాన్ని పంచుకొనేందుకు ఒక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చుతుంది. అలాగే క‌స్ట‌మ్స్ చ‌ట్టాలు స‌రైన రీతిలో అమ‌లు కావ‌డంలోను, క‌స్ట‌మ్స్ నేరాల నివార‌ణ‌లోను, క‌స్ట‌మ్స్ నేరాలపై ద‌ర్యాప్తులోను స‌హ‌క‌రిస్తుంది. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వ్యాపారానికి మార్గాన్ని సుగ‌మం చేస్తుంది. ఇరు ప‌క్షాల క‌స్ట‌మ్స్ యంత్రాంగాల స‌హ స‌మ్మ‌తితో ఈ ఒప్పందం ముసాయిదా పాఠాన్ని ఖ‌రారు చేయ‌డ‌మైంది. ఈ ముసాయిదా ఒప్ప‌దం భార‌తీయ క‌స్ట‌మ్స్ యొక్క ఆందోళ‌న‌ల‌ను మ‌రియు అవ‌స‌రాల‌ను లెక్క లోకి తీసుకొంటుంది. మ‌రీ ముఖ్యంగా, రెండు దేశాల మ‌ధ్య వ్యాపారం జ‌రిగే వ‌స్తువుల మూల స్థానం తాలూకు స‌ర్టిఫికెట్ల వాస్త‌విక‌త‌ను మ‌రియు వాటి క‌స్ట‌మ్స్ ప్ర‌క‌టిత విలువ యొక్క ఖచ్చిత‌త్వానికి సంబంధించిన స‌మాచారాన్ని పంచుకొనే విష‌యంలో శ్రద్ధ వహిస్తుంది.

***