పిఎంఇండియా
ఖాద్య తైలాలు మరియు ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కు సంబంధించి 28.09.2015 తేదీతో ప్రస్తుతం అమలులో ఉన్న సెంట్రల్ ఆర్డర్స్ వేలిడిటీ పొడిగించేందుకు మరియు పప్పుధాన్యాల విషయంలో 18.10.2015 నాటి సెంట్రల్ ఆర్డర్ చెల్లుబాటు గడువును 01.10.2016 నుండి 30.09.2017 వరకు మరొక్క సంవత్సరం పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ నిర్ణయం తాలూకు ప్రధాన ధ్యేయం ఏమిటంటే, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు ఖాద్య తైలాలకు సంబంధించిన నిల్వ పరిమితులు/ లైసెన్సింగ్ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు తగిన విధంగా ఖాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ముందస్తు సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ ఉత్తర్వులను జారీ చేసేందుకు వీలు కల్పించడమే. సాధారణ ప్రజానీకానికి ప్రత్యేకించి దుర్బల వర్గాలకు ఈ వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ చర్య మరికాస్త తోడ్పాటును అందించగలదని, అక్రమ నిల్వలు, లాభార్జన ధోరణులను నియంత్రించగలదని భావిస్తున్నారు.
పూర్వ రంగం :
15.2.2002 తేదీన జారీ అయిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి, కొన్ని కేటగిరీల ఆహార పదార్థాలను లైసెన్సింగ్, నిల్వ పరిమితులు మరియు రవాణాపరమైన ఆంక్షల నుండి తొలగించడమైంది. ఆ తరువాత నుండి ఏవైనా నిర్దిష్ట ఆహార పదార్థ ధరలలో అసాధారణ పెరుగుదల ఉంటే ఎప్పటికప్పుడు మంత్రివర్గ ఆమోదంతో 2002 ఉత్తర్వును సవరిస్తూ/ ఉత్తర్వు అమలును కొంత కాలం పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ లను జారీచేస్తోంది. పప్పుధాన్యాలపై ఆంక్షలను మొదట 2006 ఆగస్టులో విధించారు, అనంతరం పరిస్థితిని సమీక్షిస్తూ వాటిని పొడిగించారు. నూనెలను,నూనె గింజలను 2008 ఏప్రిల్ లో జతచేశారు. ప్రస్తుతం ఉన్న ఆంక్షల ఆర్డర్ చెల్లుబాటు 30.09.2016 తో ముగియనుంది. దీనితో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ గడువును మరొక్కమారు పొడిగించవలసివచ్చింది.