Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గత 11 ఏళ్లలో శాంతి, సంస్కృతి, మౌలిక సదుపాయాల రంగాల్లో అస్సాం సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావిస్తూ వచ్చిన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


 గత 11 సంవత్సరాల్లో శాంతి, సంస్కృతి, మౌలిక సదుపాయాల రంగాల్లో అస్సాం సాధించిన గణనీయమైన పురోగతిని వివరిస్తూ ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేడు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్రమంత్రి శ్రీ పబిత్ర మార్గరీటా చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

‘‘గత 11 ఏళ్లలో అస్సాం శాంతి, సంస్కృతి, మౌలిక సదుపాయాల రంగాలలో సాధించిన విశేష పురోగతి గురించి కేంద్ర సహాయ మంత్రి శ్రీ @PmargheritaBJP వివరంగా రాశారు.

వికసిత్ భారత్ @ 2047 దార్శనికతకు అనుగుణంగా అస్సాం రాష్ట్రం వికసిత్ అస్సాం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక వృద్ధిని, పర్యావరణ బాధ్యతను సమతుల్యం చేస్తూ సాగుతున్న అభివృద్ధి నమూనాను ఆయన తన కథనంలో ప్రధానంగా పేర్కొన్నారు.’’